ఆలోచించిందే తడవు
నీ గురించి నా హృదయం
ఎందుకో వేగంగా కొట్టుకోవడంలేదు.
ఎప్పటిలాగా ....
నీవు ఎదురుగా కనిపించినంతనే
ముఖాన మబ్బులు కమ్మి
ప్రకాశం దాచబడి.
తళతళ మెరుపులు కనపడటం లేదు .... కళ్ళలో
నీ పేరు ఎవరైనా ప్రస్తావించినా
వెనుదిరిగి చూడాలనిపించడటం లేదు.
చిరునవ్వు చిగురించడం లేదు.
చాన్నాళ్ళ తరువాత అనుకుంటా
నీ గొంతు ....
నీ ముగ్ద మృధు గాత్రం
సంగీతంలా వినిపించడం లేదు నాకు.
నీ స్పర్శ
నా ఆత్మను నిద్ర లేపడం లేదు.
ఎంతో సామాన్యం గా
సంబధం లేని వారి స్పర్శలా ఉందే కాని,
నా లో లోపల ....
నన్ను ఒదిలి నీవు
దూరంగా వెళ్ళిపోతావనే ఆలోచన
కన్నీళ్ళు తెప్పించడం లేదు
నిన్నటి నిజం .... ప్రేమకు ఏమయ్యిందో
ఇప్పుడే ఎందుకిలా జరుగుతుందో ....
ఎందుకిలా అప్రాకృతికంగా అనిపిస్తుందో ....
కనపడని గాయం అయి ఉంటుంది ,లేకుంటే అంతటి కఠినంగా మారదు మనసు.చంద్రగారు మనసును కదిలించింది.
ReplyDeleteకనపడని గాయం అయి ఉంటుంది, లేకుంటే అంతటి కఠినంగా మారదు స్త్రీ మనసు.
Deleteచంద్రగారు మనసును కదిలించింది.
చక్కని అభినందన స్పందన
_/\_లు శ్రీదేవీ!
దేవి అభిప్రాయం తో నేనూ నడుస్తాను, నిజమే కనపడని గాయమే, ఇలాంటి స్థబ్దత మనిషిని కదలనీక కట్టిపడేస్తుంది.
ReplyDeleteసర్, ఎప్పటిలా మీ కవిత ఓ కొత విశేషాన్ని సంతరించుకుంది.
దేవి అభిప్రాయం తో నేనూ నడుస్తాను, నిజమే కనపడని గాయమే, ఇలాంటి స్థబ్దత మనిషిని కదలనీయక కట్టి పడేస్తుంది.
Deleteన్యాయమేమో ఆలోచించాలి
సర్, ఎప్పటిలా మీ కవిత ఓ కొత విశేషాన్ని సంతరించుకుంది.
చక్కని విశ్లేషణ స్పందన ఒక స్నేహ ప్రోత్సాహక అభినందన
ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!
నిన్నటి నిజం .... ప్రేమకు ఏమయ్యిందో..చాలా బాగుంది చంద్రగారు
ReplyDeleteనిన్నటి నిజం .... ప్రేమకు ఏమయ్యిందో..
Deleteచాలా బాగుంది చంద్రగారు
చాలా బాగుంది స్పందన స్నేహాభినందన
ధన్యవాదాలు హిమజ ప్రసాద్ గారు!