Saturday, February 1, 2014

సమాజం లో



ఆశించేందుకు ఏముంటుంది!?
మునిగిపోతుందని తెలిసీ
చేస్తున్న
పడవ ప్రయాణం,
జీవన సాగర యానం లో ....
తెడ్లతోఁఅనుభవం లేని
సామాజిక అధ్యయనం లేని మనిషి
పడవను నడుపుతూ,
సారద్యం వహిస్తూ ....
తెడ్లను వాడటం తెలిసీ
సామాజిక అధ్యయనం చేసీ
దూరంగా కూర్చునుండే మనుషులతో ....
కలిసి ప్రయాణం చెయ్యాల్సొస్తే 


ఆశించేందుకు ఏముందని?!

14 comments:

  1. సమాజంలో జరుగుతున్నదే అది ,సమర్ధులను పక్కకు తోసి అసమర్ధులు చేస్తున్న వీరంగం చూస్తూ నిశ్చేష్టులమవడం మామూలైపోయింది...చంద్రగారు వాస్తవాన్ని అద్భుతంగా వివరించారు.

    ReplyDelete
    Replies
    1. "నేడు సమాజంలో వాస్తవం గా జరుగుతున్నదే అది, సమర్ధులను పక్కకు తోసి అసమర్ధులు చేస్తున్న వీరంగం చూస్తూ నిశ్చేష్టులమవడం మామూలైపోయింది...
      చంద్రగారు వాస్తవాన్ని అద్భుతంగా వివరించారు."

      ఏకీభావన బాగుంది
      నా కవిత ద్వారా నేను వ్యక్తం చెయ్యాలనుకున్న భావన మాత్రం
      సమర్ధులు సమాజం తో సంబంధాన్ని కోల్పోయిన వారిలా మాకేం అన్నట్లు ప్రేక్షకులుగా ఉండటం కూడా ....
      బాగుంది చక్కని మీ విశ్లేషణాత్మకత స్పందన ....
      _/\_లు శ్రీదేవీ!

      Delete
  2. సంస్కరణ సాధ్యమైతే ఎంతబాగుంటుందో!

    ReplyDelete
    Replies
    1. "సంస్కరణ సాధ్యమైతే ఎంతబాగుంటుందో!"

      సమర్ధులు సమాజం తో సంబంధాన్ని కోల్పోకుండా .... మాకేమిటి అన్నట్లు ప్రేక్షకులుగా ఉండకుండా భాగస్వాములైతే సంస్కరణలు సాధ్యమే ....

      బాగుంది స్పందన చక్కని సూచన ....
      ధన్యాభివాదాలు పద్మార్పిత గారు!

      Delete
  3. సర్, మీ ఆలోచనా విదానం మెచ్చదగ్గది,
    సామాజిక స్ప్రహలేని వాడు సమాజం నుంచి ఏదీ కోరుకోలేడు.ఏవరో స్వాతంత్రయం తెస్తారులే అనుకుని ఆ నాటి ప్రజలు అనుకుంటే ఇప్పటికీ మనమంతా బానిసలమే.

    ReplyDelete
    Replies
    1. సర్, మీ ఆలోచనా విదానం మెచ్చదగ్గది. సామాజిక స్పృహలేని వాడికి సమాజం నుంచి ఏదీ కోరుకునే అర్హత లేదు. ఏవరో స్వాతంత్రం తెస్తారులే అనుకుని ఆ నాడు ఎవరికి వారు అనుకుని ఉంటే ఇప్పటికీ మనమంతా బానిసలం గానే బ్రతుకుతూ ఉండేవాళ్ళము. అందుకని సమర్ధులు సమాజం తో సంబంధాన్ని కోల్పోయిన వారిలా మాకేం అన్నట్లు ప్రేక్షకులుగా ఉండకుండా ఉంటే బాగుంటుంది.

      నిజంగా ఎంతో బాగుంది మీ స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన

      _/\_లు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete
  4. సమర్ధులకు రాజ్యంలో సమర్ధత లేనప్పుడు..రాజ్యం ఎడల ముభావికంగా వుంటారు..ప్రతిభకు ఎక్కడ గౌరవం వుంటే అక్కడకు వెళ్తారు..సమాజమే వార్ని దూరం చేసుకుంది..

    ReplyDelete
    Replies
    1. "సమర్ధులకు సమాజంలో సమర్ధత లేనప్పుడు .... సమాజం పట్ల ముభావికంగా వుంటారు .... ప్రతిభకు ఎక్కడ గౌరవం వుంటే అక్కడకు వెళ్తారు .... సమాజమే వార్ని దూరం చేసుకుంది."

      ఓలేటి గారు మిమ్మల్ని హృదయపూర్వకంగా బ్లాగుకు ఆహ్వానిస్తున్నాను.
      విజ్ఞత సమర్ధత ఉన్నవాళ్ళను గుర్తించాల్సిన బాధ్యత సమాజానికి ఉంది కానీ ఆ సామర్ధ్యాన్ని గుర్తించేందుకైనా విజ్ఞత ఉండాలిగా .....
      మీ అభిప్రాయం లో బలం ఉంది.
      చక్కని ఆలోచనాత్మక స్పందన
      ధన్యాభివాదాలు వోలేటి గారు! శుభారుణోదయం!!

      Delete
  5. క్షమించాలి..పై వ్యాఖ్యానంలో "రాజ్యం" బదులు "సమాజం " అని సవరించగలరు..

    ReplyDelete
    Replies
    1. "సమర్ధులకు సమాజంలో సమర్ధత లేనప్పుడు .... సమాజం పట్ల ముభావికంగా వుంటారు .... ప్రతిభకు ఎక్కడ గౌరవం వుంటే అక్కడకు వెళ్తారు .... సమాజమే వార్ని దూరం చేసుకుంది."
      అనేగా మాష్టారు.

      Delete
  6. ఈ రోజు TOIలో వచ్చింది, IIT లలో చదివినవాళ్ళు 60000 మంది US లో ఉన్నారట.

    ReplyDelete
    Replies
    1. "ఈ రోజు TOIలో వచ్చింది, IIT లలో చదివిన వాళ్ళు 60000 మంది US లో ఉన్నారట."

      బోనగిరి గారు .... మనస్పూర్తిగా బ్లాగుకు స్వాగతం.

      నిజం! దేశం ఎందరో ఉత్తములు సరస్వతీ పుత్రుల సేవలను కోల్పోయింది అని బాధగా ఉంది. ప్రభుత్వం తీవ్రం గా ఆలోచించాల్సిన విషయం ఇది. డబ్బు ఒక్కటే కారణం అనుకోలేము సరైన గుర్తింపు ఇవ్వని ఉదాశీనత కొంత వరకూ కారణం

      చక్కని విచక్షణాత్మక స్పందన
      ధన్యవాదాలు బోనగిరి గారు! శుభోదయం!!

      Delete
  7. కమ్యునిష్టులు దుర్మార్గమైనవి అని విమర్శించే పెట్టుబడి దారీ ఆర్ధిక శాస్త్రాలు రచించిన వారు కూడా అవి ప్రజలకు ప్రయోజనం ఆశించే వాటిని రచించారు. వారంతా కామన్ గా చెప్పే మాట ఒకటే - ధర్మ బధ్దులయిన ప్రజల కార్యాచరణ తోనే ఇవి సత్ఫలితాల నిస్తాయని. యెకనామిక్స్ గురించి డీప్ గా నాకు తెలియదు గానీ ఒకటి అబ్సర్వ్ చేశాను - running economy never suffers with inflation. if you feel inflation It means economy became stagnate.(collapsed).But a mysterious thing is - why so many economists like manmohan singh and chidambaram failed to cure - that too after they took administrative seat also?

    ReplyDelete
    Replies
    1. సూరపనేని హరిబాబు గారు నా బ్లాగుకు హృదయపూర్వక స్వాగతం!
      చాలా చక్కని ఆలోచనాత్మక స్పందన మీది.
      "running economy never suffers with inflation. if you feel inflation It means economy became stagnate.(collapsed).But a mysterious thing is - why so many economists like manmohan singh and chidambaram failed to cure - that too after they took administrative seat also?"
      ఆర్దిక సంస్కరణలు మేలు చేస్తాయి తప్పనిసరిగా అందువల్ల వచ్చే విపరీత పరిణామాలను ముందుగా ఊహించి సరైన కంట్రోలింగ్ మెకానిజం ను ఏర్పాటు చేసి ఉంటే .... ప్రకాశం ఎంత ఎక్కువైతే ఆ వెనుక నీడ కూడా అంతే ఘాడంగా ఉంటుంది.
      ఒక కంపనీ ఒక ప్రొడక్ట్ చెయ్యడానికి ఎలా అయితే ఒక లైఫ్ సైకిల్ ఫాలో అవుతుందో డాక్యుమెంటేషన్ తో సహా అలాగే ప్రపంచీకరణ దిశగా అడుగులు వేసే ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకునుంటే బాగుండేది. సంస్కరణలు నిజంగా తప్పైతే చైనా ప్రపంచాన్ని శాసించే స్తాయి కి ఎదిగి ఉండకూడదు.
      మీకు నా మనోభివాదాలు హరిబాబు గారు! శుభారుణోదయం!!

      Delete