గుసగుసలాడుతు గాలి
ఎప్పుడైనా, ఎక్కడైనాప్రతీకారం కోపం మాటలను
దరి రాకుండా చూడగలిగితే బాగుంటుంది.
మనిషిదా నేను చెయ్యగలిగిందొక్కటే
ఎవరైనా, ఎప్పుడైనా
మాటలతో ఆటలు ఆడుతూ ఉంటే
తదేకంగా చూసి ఆశ్చర్యపోతూ ప్రశంసించగలను.
కనీసం మరో సూర్యాస్తమయ వేళనుకుని
హొయలు, వయ్యారం, గడుసుతనం అందం ను
ఆస్వాదిస్తున్న భ్రమ్ను కలిగిస్తూ నటించగలను
శోకం, శ్రమ గాయాలకు ఊరట పొంది
ఎన్నాళ్ళుగానో కుదవబెట్టుకునున్న దీర్ఘకాల కలల
ఆలింగనం చేసుకుంటూ జీవించగలను.
మేఘాలలో తేలి దూరదూర ప్రాంతాలకు కదిలి
అప్పుడప్పుడూ అవసరానికి వర్షిస్తూ
ఆనందిస్తూ
ఎంతో ప్రియంగా
చిత్రమైన భావనల గాలిపాటలు పాడుతూ
నిస్తేజమైన జీవితాల, శూన్యత్వాల్లో చైతన్యాన్ని
నింపుతూ
ఈ సమాజం ఏ ఇబ్బంది కలిగించని విధంగా జీవించాలని
ఎన్నాళ్ళుగానో కుదవబెట్టుకునున్న దీర్ఘకాల కలల
ReplyDeleteఆలింగనం చేసుకుంటూ జీవించగలను.
ఎంతో బాగున్నాయి చంద్రగారు.
ఎన్నాళ్ళుగానో కుదవబెట్టుకునున్న దీర్ఘకాల కలల
Deleteఆలింగనం చేసుకుంటూ జీవించగలను.
ఎంతో బాగున్నాయి చంద్రగారు.
ఒక చక్కని స్నేహాభినందన మీ స్పందన
నమస్సులు శ్రీదేవీ!
ఎన్నాళ్ళుగానో కుదవబెట్టుకునున్న దీర్ఘకాల కలల
ReplyDeleteఆలింగనం చేసుకుంటూ జీవించగలను.
మేఘాలలో తేలి దూరదూర ప్రాంతాలకు కదిలి
అప్పుడప్పుడూ అవసరానికి వర్షిస్తూ
ఆనందిస్తూ
ఎంతో ప్రియంగా
చిత్రమైన భావనల గాలిపాటలు పాడుతూ
నిస్తేజమైన జీవితాల, శూన్యత్వాల్లో చైతన్యాన్ని
నింపుతూ
ఈ సమాజం ఏ ఇబ్బంది కలిగించని విధంగా జీవించాలని
ఎక్కడ బావుందో చెప్పడం చాలా కష్టం చంద్ర గారు మీ కవితలో ఎలా రాస్తారు అండి ఇంత సొంపైన భావాలు ..మీకు వందనాలు
ఎన్నాళ్ళుగానో కుదవబెట్టుకునున్న దీర్ఘకాల కలల ఆలింగనం చేసుకుంటూ జీవించగలను.
Deleteమేఘాలలో తేలి దూరదూర ప్రాంతాలకు కదిలి, అప్పుడప్పుడూ అవసరానికి వర్షిస్తూ .... ఆనందిస్తూ, ఎంతో ప్రియంగా .... చిత్రమైన భావనల గాలిపాటలు పాడుతూ
నిస్తేజమైన జీవితాల, శూన్యత్వాల్లో చైతన్యాన్ని .... నింపుతూ .... ఈ సమాజం ఏ ఇబ్బంది కలిగించని విధంగా జీవించాలని
ఎక్కడ బావుందో చెప్పడం చాలా కష్టం చంద్ర గారు మీ కవితలో
ఎలా రాస్తారు అండి ఇంత సొంపైన భావాలు ..
మీకు వందనాలు
ఒక నిండైన స్నేహాభిమానం ప్రోత్సాహక అభినందన మీ స్పందన
_/\_లు మంజు యనమదల గారు!