నేను అనుకోవడం లేదు.
ఎవరో ఏదో అయిపోతారని
నేను చనిపోతే ....
మనసులో మాట చెబుతున్నాను.
ఎందరినో బాధించాను.
తెలిసి కొన్నిసార్లూ, తెలియక కొన్నిసార్లూ
చెప్పిందే చెప్పి,
నేను చూసిన దృష్టితో
సమాజాన్ని చూడమని, ఎందరినో ....
వాస్తవాలు చూపించాలనే ప్రయత్నం .... లో
నన్ను వింటున్నట్లే నటించి
వారి ఆలోచనల్నే వారు అనుసరిస్తారని తెలిసీ,
కొందరు స్నేహితులు .... మాత్రం,
కలిసి తిరిగిన క్షణాల అనుభవాల్ని
నెమరువేసుకుని బాధపడతారు.
స్వచ్చంగానే
కానీ
వాళ్ళూ
కాలం తో పాటు ముందుకు కదులుతారు.
చెప్పకుండా వెళ్ళిపోయానని .....
నేను వంచించానని అనుకుంటూ,
ఆమె బాధపడుతుంది.
ఊహించని స్థితికి ఏడుస్తుంది.
తిట్టుకుంటుంది.
ఎన్నో ప్రమాణాల్ని గాలికి ఒదిలి .... వెళ్ళిపోయానని,
బాధ్యతల భారం మొయాల్సొచ్చిందని.
కానీ
కాలం లేపనం మరుపును తెస్తుంది.
ఆమె నన్ను మరిచిపోతుంది.
మరొకర్ని ఒప్పించాల్సిన అవసరం లేని,
స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని
సంతోషించనూ వచ్చు!
కాలగతిన నేను లేని జీవితాన్ని.
ఔనూ ఎవరికి అవసరం?
ఒక పిరికివాడు,
ఒక సామాన్యుడు,
ఒక నిర్బలుడు,
ఒక ఉద్వేగి .....
నిజంగా ఇలాంటి సాహచర్యం అవసరమా!
ఇతని గురించి ఇంతగా ఆలోచించాలా?
ఇతనుగా ఇతను చేసుకున్నదేగా!
జరగాల్సిందే జరిగింది.
నేను ఎంతగానో ద్వేషించే ఈ నిజం
నిజం! నిజమే
ఈ ఆలోచనల్లో బలం వాస్తవం ఉన్నాయి.
నిజం! నిజమే!
ReplyDeleteఔను ఎవరికి అవసరం?
ఔను కొన్ని వాస్తవాలు జీర్ణం కావు...
నిజం! నిజమే!
మనసులో మాట చెబుతున్నాను...
ఈ నిజమొక వాస్తవం...
సత్యం...
నిజం! నిజమే!
Deleteఔను ఎవరికి అవసరం?
ఔను కొన్ని వాస్తవాలు జీర్ణం కావు...
నిజం! నిజమే!
మనసులో మాట చెబుతున్నాను....ఈ నిజమొక వాస్తవం....సత్యం...
ఎన్ ఎం రావు బండి గారు జీవితం లో .... ఎప్పుడైనా ఆగి వెనుదిరిగి చూసుకున్నా, లేక తరువాత ఏం జరగబోతుంది అని ఆలోచించే ప్రయత్నం చేసిన .... వచ్చే సమాధానం ..... ధన్యవాదాలు ఎన్ ఎం రావు గారు! శుభసాయంత్రం!!
ఈ వాస్తవాన్ని ఒప్ప్పుకోవటానికి చాల ధైర్యం కావాలి,
ReplyDeleteమార్చుకోవటానికి మరో జన్మ కావాలి,
అంగీకరించటానికి చాలా వ్యవధి కావాలి,
అసమర్దత అనుకొవటానికి ఆత్మస్తైర్యం కావాలి.
అందుకే,
మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి,
జీవితమం లో ఒక్కరినైనా మనస్పూర్తిగా నమ్మాలి,
జీవితమంటే అలా నీరసంగా సాగిపోవటం కాదు, వెసే ప్రతి అడుగూ బలంగా ఉండాలి,
మంచి జ్ఞాపకానికి నీవే నిర్వచనం కావాలి.
ఈ వాస్తవాన్ని ఒప్ప్పుకోవటానికి చాల ధైర్యం కావాలి, మార్చుకోవటానికి మరో జన్మ కావాలి, అంగీకరించటానికి చాలా వ్యవధి కావాలి, అసమర్దత అనుకొవటానికి ఆత్మస్తైర్యం కావాలి.
Deleteఅందుకే, మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి, జీవితమం లో ఒక్కరినైనా మనస్పూర్తిగా నమ్మాలి, జీవితమంటే అలా నీరసంగా సాగిపోవటం కాదు, వెసే ప్రతి అడుగూ బలంగా ఉండాలి, మంచి జ్ఞాపకానికి నీవే నిర్వచనం కావాలి.
సూక్ష్మ పరిశీలన మానసిక విశ్లేషణా మేళవించిన ఒక చక్కని స్పందన స్నేహ ఆత్మీయాభినందన
ధన్యాభివాదాలు ఫాతిమా గారు! శుభసాయంత్రం!!
ఐనా జీర్ణం చేసుకోక తప్పదు చంద్రగారు,అలా అయితేనే మనం లేనప్పుడు ఎలా ఉంటారో చూడగలం ముందే.....
ReplyDeleteఐనా జీర్ణం చేసుకోక తప్పదు చంద్రగారు, అలా అయితేనే మనం లేనప్పుడు ఎలా ఉంటారో చూడగలం ముందే.....చూసి స్థిమితపడగలం
Deleteబాగుంది స్పందన స్నేహ ఆత్మీయాభినందన
నమస్సులు శ్రీదేవీ! శుభోదయం!!