ఆమె చెప్పుకుంటుంది. సాగదీస్తూ,
నిన్నటి గురించి,
ఒకప్పటి నన్ను,
వసపోసిన నా వాగుడు లక్షణాన్ని
గంటల కొద్దీ తనతో గడిపి,
నవ్వించి ఆనందించిన .... నన్ను గురించి.
ఆమె ప్రేమ కోసం తపించి,
భక్తుడినై ....
పరికిణీల జూలియట్ కోసం
బస్టాండుల వెంట రోమియోలా తిరిగిన
ఒకప్పటి నన్ను గురించి,
మురిపెంగా పదే పదే తనలో తను.
వయసు మీదపడి ఇప్పుడు,
అప్పటి నేనులా ఉండలేకపోతున్నా!
అయినా ఒప్పుకోను. వాదిస్తాను.
కాలంతో పాటు మార్పులు సహజం అని,
మనం మనుషులం అని,
అందుకు మనం మినహాయింపు కాదూ అని,
.
రేడియో లా ఇరవైనాలుగు గంటలూ
తను మాట్లాడుతుంటే, వింటూ ....
ఆ ముఖభావనల్ని గమనిస్తూ,
మధ్య మధ్య కురిసే ఆ నవ్వుల్లో తడుస్తూ,
బ్రతికెయ్యొచ్చు అని ఎందుకనిపించేదో ఆనాడు,
ఇప్పుడదే పిచ్చేమో అనిపిస్తుంది.
అప్పటిలా యిప్పుడెందుకో ఆమెలో
ప్రియురాలిని, చూడలేకపోతున్నాను.
సహధర్మచారిణినే తప్ప,
వెన్నెల్లో తడుస్తూ నర్తించాలని అనిపించడం లేదు..
ఆమె గొంతు అరిగిపోయిన
గ్రామఫోన్ రికార్డ్ లా చీకాకనిపిస్తూ,
తల నెరిసి, ముఖాన ముడతలొచ్చి
గొణుగుతూ తను.
ఎప్పుడూ సాదిస్తూ ఉన్నట్లే ఉంటుంది.
ఒకప్పటి నువ్వు కాదు అంటూ,
నేను ఆమె, జ్ఞాపకాన్ని మాత్రమే
ఆ జ్ఞాపకానికి అస్తిత్వం లేదు .... ఆమె తలలో తప్ప.
ఓ జీవిత కాలాన్ని, తరాల తర్వాత ఎత్తిపోతల పనిగా రాసిన కవితే ఇది,
ReplyDeleteఇందుకో ఓ కోణాన్ని చూస్తే బార్య ముదిమిగా అనిపిస్తుందాఅ అని కోపం రాక మానదు,
కానీ మానసిక వీవనతో విసిరి చూస్తే నిజమే కదా అనిపిస్తుంది.
మీ సామాన్యమైన (అలా అనిపించే) రాతలవెనుక దాగిఉన్న రమణీయత ఇది.
"ఓ జీవిత కాలాన్ని, తరాల తర్వాత ఎత్తిపోతల పనిగా రాసిన కవితే ఇది, ఇందులో ఓ కోణాన్ని చూస్తే బార్య ముదిమిగా అనిపిస్తుందా అని కోపం రాక మానదు, కానీ మానసిక వీవనతో విసిరి చూస్తే నిజమే కదా అనిపిస్తుంది. మీ సామాన్యమైన (అలా అనిపించే) రాతలవెనుక దాగిఉన్న రమణీయతే ఇది."
Deleteఒక గొప్ప ప్రశంస, చక్కని విశ్లేషణ .... రమణీయ అభినందన
ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభమధ్యాహ్నం!!
very good poetry.
ReplyDeleteవెరీ గుడ్ పోయెట్రీ
Deleteబి వి సాంబు సాంబు గారు ముందుగా మిమ్మల్ని బ్లాగుకు స్వాగతిస్తున్నాను.
మీ స్పందనను ఒక ప్రోత్సాహక అభినందన గా భావిస్తున్నాను.
_/\_లు Bvsambu Sambu! శుభారుణోదయం!
కాలాన్ని కేవలం శరీరం మాత్రమే అనుసరించిందన్నమాట , మనసు మాత్రం ఆగిపోయింది అలా అయితే ఇబ్బంది చంద్రగారు.
ReplyDelete"కాలాన్ని కేవలం శరీరం మాత్రమే అనుసరించిందన్నమాట, మనసు మాత్రం ఆగిపోయింది అలా అయితే ఇబ్బంది కదూ చంద్రగారు."
Deleteమీ సూచన గమనించాను శ్రీదేవీ! బహుశ నా ఉద్దేశ్యాన్ని ప్రాపర్ గా ప్రజెంట్ చెయ్యలేక పోయానేమో అనిపిస్తుంది.
వయసు మీద పడ్డాక స్త్రీ పురుషుల దృష్టి కోణాలలో తేడా ఉంటుంది .... అని చెప్పాలనుకున్నాను. .... అదే ప్రాకృతికం కూడా అని. అతనికి ఆమంటే ఇష్టం, ప్రేమ .... కానీ, ఒక ప్రియురాలిలా కాదు, సహదర్మచారిణిలా మాత్రమే! వయసు మీదపడ్డాక .... స్త్రీ, పురుషుల్లో ఒకరు భావనలకు, ఒకరు సౌందర్యానికీ ఆకర్షితులౌతారని చెప్పాలనే ప్రయత్నం ఇది! జీవితం నేర్పే పాటాలు కొన్నైతే కాలం నేర్పే పాటాలు ఇంకొన్ని అని,
ఒక చక్కని ప్రోత్సాహక అభినందన స్పందన.
నమస్సులు శ్రీదేవి!.