ఈ కవిత అంకితం అతని ఊహల సహచరిణికి
ఆమె ఎంత అమూల్యమో .... అతనికి
ఎంత ఇష్టం, ప్రేమో ఆమంటే అని,
రాసుకుంటుంటే!
ఒక నమ్మకం, అభిమానం మాత్రమే కాదు.
నిజం! .... అతనికి, ఆమె ఒక గొప్ప బహుమానం.
ఆమె .... అతని సూర్యోదయము.
అతని సూర్యాస్తమయము.
అతని రాత్తిరి.
అతను శ్వాసించే గాలి,
అతనికి ఎంతో ప్రీతిపాత్రమైన వారసత్వం పునాది.
ఆమె .... ఒక స్నేహితురాలు అతను ఒంటరి అయినప్పుడు,
అతను బలహీనపడినప్పుడు తోడై బలాన్నిచ్చే ధైర్యం ఆమె
అతన్ని నిద్దుర లేపి, చైతన్యవంతుడ్ని చేసే
సూర్య కిరణాల ప్రకాశం .... ఆమె
సున్నితమైన చేతి వేళ్ళతో తాకి
సమశ్యలన్నీ మటుమాయం చేసే ఔషదం ....
ఆమె, అతని .... ఆనందం, సంతోషం
తేనెను పోగుచేసి, బాధల్ని పంచుకునే సహచరి
బహుశ, అతని కోసమే ఆమె,
ఆమె కోసమే అతను జీవిస్తున్నారేమో అనిపించేలా
అతని ప్రపంచాన్ని వెలుగుమయం, ప్రేమ, స్వర్గమయం
చేసేందుకే పుట్టిందేమో .... ఆమె,
అతను మాటల్లో చెప్పలేని భావం ....
జీవితం అవసరమూ, జీవన ప్రాణవాయువూ ఆమె.
ప్రతి యువకుడి యౌవ్వనం లో, ఊహల్లో
అతను కోరుకున్న భార్యామణి వ్యక్తిత్వం ఆమె.
అనంతమైన,అపురూపమైన, ఊహా,ఊపిరీ < అయిన "ఆమె" కు శుభాబివందనాలు.
ReplyDeleteభావానికి పెద్ద పీటవేసిన మీ కవిత్వం చాలా బాగుంది.
అనంతమైన, అపురూపమైన, ఊహా, ఊపిరీ .... అయిన "ఆమె" కు శుభాబివందనాలు. భావానికి పెద్ద పీటవేసిన మీ కవిత్వం చాలా బాగుంది.
Deleteబాగుంది స్పందన స్నేహ ఆత్మీయ ప్రోత్సాహక అభినందన
ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!
ప్రతి యువకుని ఊహలో భార్య వ్యక్తిత్వం నిజంగా అలానే ఉంటుంది . ఊహలో వ్యక్తి భార్య కానపుడు ,భార్యగా వచ్చిన ఆమెలో అదే వ్యక్తిత్వాన్ని చూడగలిగితే అతని వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది. మీ కవితలు అనుభవాలసారాలు .
ReplyDeleteప్రతి యువకుని ఊహలో భార్య వ్యక్తిత్వం నిజంగా అలానే ఉంటుంది. ఊహలో వ్యక్తి భార్య కానపుడు, భార్యగా వచ్చిన ఆమెలో అదే వ్యక్తిత్వాన్ని చూడగలిగితే అతని వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది.
Deleteమీ కవితలు అనుభవాలసారాలు .... ప్రేరణాత్మక ఏకీభావన మీ స్పందన
ధన్యవాదాలు శ్రీదేవి గారు. శుభోదయం!!