Tuesday, December 17, 2013

బొమ్మ



 














ఆమె

ఒక ఖాళీ పాత్ర.

ఒక పొడి పుష్పం,
నిట్టనిలువుగా రేకులు రాలుతూ
దాయలేకపోతున్న ఆ చిరుగు వస్త్రం మోస్తూ.

ఆమె

ఒక గాజు బొమ్మ.

శుద్ద మానసం,
ఎవరి ఆడటం సరదా కోసమో.
పెళ్ళున పగిలిన ఒక నమ్మకం ఓడి పడిపోయి,

ఆమె ఒక పగిలిపోతున్న వాస్తవం.

4 comments:

  1. ఆమె ఓ పగిలిపోతున్న వాస్తవ గాజుముక్క, మంచి ఉపమానం

    ReplyDelete
    Replies
    1. ఆమె పగిలి.... వాస్తవ గాజుముక్క,
      ముఖపుస్తకం తెరుస్తూనే ఎదురొచ్చిన పలుకరింపు స్పందన
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!

      Delete
  2. మనసులోని భావాలకిక చోటు లేక అయింది ఆమె ఒక ఖాళీ పాత్ర , ఓడిపోయి , ఓడుపోయిన గాజుబొమ్మ పగిలిపోవడం వాస్తవాలను చూపింది . కవిత చాలా బాగుంది చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. మనసులోని భావాలకిక చోటు లేక అయింది ఆమె ఒక ఖాళీ పాత్ర, ఓడిపోయి, ఓడుపోయిన గాజుబొమ్మ పగిలిపోవడం వాస్తవాలను చూపింది. కవిత చాలా బాగుంది చంద్రగారు
      చాలాబాగుంది పలుకరింపు స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు శ్రీదేవి! శుభారుణోదయం!!

      Delete