చెప్పలేరు ఎవరూ. ఎంతప్రయత్నించినా
ఏ ప్రేమ మొలక .... ఎప్పుడు చిగురులేస్తుందో
అంకురం దశలోనే .... మురిగిపోతుందో అని,
మది భావనలు, ఎద స్పందనలు రెట్టింపై
ఏది వాస్తవమో, ఏది కృత్రిమమో తెలియని క్షణాల్లో.
.............
ఎప్పుడైతే, తనలో .... లోలో సర్వం చిద్రమై
అస్తిత్వం ముక్కలై, చెల్లాచెదురైన క్షణాల్లో ....
ఏమని చెప్పగలరు? ఎవరైనా ....
ఉప్పొంగే హృదయస్పందనల్ని దాచుకోవాల్సి వస్తే
దాచుకునేందుకు మదుగే లేకపోతే
.......................
ఒకవైపున జీవితం సాఫల్యం చెందిందని
మరోవైపున హృదయం కన్నీరు వర్షిస్తూ
అంతా సవ్యం, ఎక్కడా పొరబడటం లేదు అని
తప్పేందుకు అవకాశమేలేదు అని అనుకుంటూ,
హృదయం మాత్రం దైన్యంగా, సుడిగుండం లో
చిక్కుపోయినట్లు ఉక్కిరిబిక్కిరౌతుంటే ....
.........................
తలదాచుకుందుకు .... మనసు పరామర్శ
కనీసం నీడ దొరకని క్షణాల్లో .... కణ విశ్చిన్నం
గమనించక తప్పనిసరైనప్పుడు,
అది ఊపిరి అందీ అందని గుండె పోటే అవుతుంది.
అప్పుడు ఆ ప్రాణం ఉంటుందో, పోతుందో
చెప్పేదెలాగా? ఎవరికి తెలుసని!?
గుండెకు దగ్గరైన ఏ అనుబంధాన్నైనా మనస్సుతో విష్లేషించుకోవటమే జరుగుతుంది, కానీ ఎక్కడో ఏదో తెలీని బ్రమలు మనిషిని ఆడిస్తుంటాయి,
ReplyDeleteమీ కవితలోని నైజం మానవ సహజమే అనిపిస్తుంది, కానీ తరచి చూస్తేనే సున్నితత్వం తెలిసేది.
సర్, మీ కవితల్లో భావం బాగుంటుంది.
గుండె.... ఏ అనుబంధాన్నైనా మనస్సుతో విష్లేషించుకోవటమే జరుగుతుంది, కానీ .... ఏదో తెలీని బ్రమ.... మనిషిని ఆడిస్తు...., మీ కవితలో.... తరచి చూస్తేనే సున్నితత్వం తెలిసేది.... భావం బాగుంటుంది.
Deleteవిశిష్టాభినందన స్పందన బాగుంది. ధన్యవాదాలు మెరాజ్ గారు! శుభసాయంత్రం!