నాడు, ఏదో ఆశించి ....
నీకు, దూరంగా
సుఖం, సౌకర్యం, సంతోషం
కనుగొనేందుకు పారిపోయి ....
తిరిగి, నేడు నీ చెంతకొచ్చాను.
నీకూ తెలుసు!
ఈ చెడిన అల్లరి లక్షణం
ఈ ప్రయత్నం లో ఏమీ పొందలేదు అని,
నా తలరాత
అల్లరి ఆశ ఎగరేసిన బంతి
ఇలా,
తిరిగి, తిరిగి
నేలకు, ఇంటికి చేరి
నిశ్శబ్దంగా .... దోషిలా నీ ముందిలా,
ఓ అమర ప్రేమ కి గుర్తుగా పడిన శిక్ష.
ReplyDeleteఅల్లరి అనుకొనే భావన
చేసిన పొరపాటుకు తలొంచుకోవాల్సొచ్చిన దోషి .... తనకు తాను విదించుకున్న శిక్ష తలొంపు.
Deleteధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు!