Sunday, December 15, 2013

మరణావస్థ




మరణించిన కళ్ళ మసకేసిన అద్దాలవి
అక్కడ, అన్నీ
జ్ఞాపకాల ఏడుపులే ....
భయంకరమైన కన్నీటి చారలే.

అది బ్రతకడానికి చేసే
పోరాటం అని అనుకోను.
కళ్ళముందు ఆకశ్మికం గా కనిపించిన 
మృత్యువును చూసిన అచేతనావస్థ అనుకుంటా.

ఎంతో లోతుగా నన్ను ఎవరో
భూస్థాపితము చేయబోతున్నట్లు,
బలంగా శవపేటికపై వొరుసుకుపోయేలా
నన్ను ఎవరో తాళ్ళతో కట్టేస్తున్నట్లు,

కాకుల్నుద్దేశించి, తన అయిష్టాలే ఇష్టాలని జరిగే
పిండం ధానాల బంతుల్లాంటి ముద్దలు ....
చేసిన పాపాల ప్రభావాన్నుంచి స్వర్గానికి
సాగనంపే షార్ట్ కట్ల దారులు అవి అనే నమ్మకాలు.

ఏ శతృవు కూడా ఊహించని,
ఇష్టపడని శిక్షలు, ఆ చీకటి విస్తరణలు
సహచరిణిని సౌందర్యరహితంగా
మార్చే సాంప్రదాయ ప్రక్రియలు అవి.

మరణించిన నా కళ్ళ మసకేసిన అద్దాల్లో
అక్కడ, అన్నీ
అనుబంధాల ఏడుపులే ....
భయంకరమైన కన్నీటి చారికలే.

చివరికి నా అస్తిత్వం యొక్క యెముకలు
రంగును కోల్పోయి మట్టేసిపోతున్నట్లు ....
ఔనూ! బ్రతికున్నప్పుడే చేసిన పాపాల్ని
కొన్నింటినైనా సేవ, ధర్మాల తో కడిగి, తగ్గించుకుంటే,


4 comments:

  1. ఏమి చెప్ప మంటారు, సామాజిక పరివర్తనకు చిన్ని చిట్కా అనుకోవాలా, వీరేశలింగాన్ని గుర్తుతెచ్చుకొనే సంతాప(సంతోష) సభ అనుకోనా.. ఒక్కటి మాత్రం చెప్ప గలను సునిసతంగా,సున్నితంగా అద్యయనం చేయగలిగితే.... ఓ జిడ్డు క్రిష్ణ మూర్తి కనిపిస్తున్నాడు.
    అధ్బుతమైన కవిత సర్.

    ReplyDelete
    Replies
    1. అప్పుడప్పుడు ఇలాంటి గొప్ప సంఘ సంస్కర్తల ను గుర్తు తెచ్చుకునే గొప్ప సంస్కారం మీది. మీ కామెంట్ చదువుతుంటే అద్భుతమైన చిక్కని అభిమానాన్నే స్పందనగా చూస్తున్నట్లుంది. ఈ ప్రశంస సామాన్యమైనది అని అనుకోలేను. బాధ్యతల్ని పెంచే ప్రోత్సాహక వ్యాఖ్య అనుకుంటాను. ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!

      Delete
  2. సమాజంలో ఎటు చూసినా సిగ్గుపడవలసిన సంఘటనలే ,సినిమా టికెట్ కోసం ఎన్ని గంటలైనా వేచివుంటారు లైన్లో ,ఇంటర్నెట్ సెంటర్లో ఎన్ని గంటలైనా వేచివుంటారు,పేకాటల్లో ఎంతసేపైనా గడిపేస్తారు ,కాలేజీల ముందు ఎంత సేపయినా నిలుచుంటారు . అంత్యేష్టి కార్యక్రమం అంటే .... తమ విలువైన సమయం వృధా అయిపోతున్నట్లు ఫీలవుతూ అన్నీ షార్ట్ కట్లే .... కట్టెలు కొని ,పేర్చి ..... ఇంత అవసరమా ? చనిపోయిన ఆయన చూడవచ్చాడా ?ఒక్క స్విచ్ నొక్కితే సరిపోదూ .... " మమ " అనిపిస్తే చాలు . అమ్మ బాధ పడుతుందా ?అయితే ఏమిటి .... అసలే టైం లేదు .... ఎంత బిజీ అయిపోయారు .... అసలు వీళ్ళు ఎప్పటికైనా మారతారా , మానవత్వం ఛాయలనయినా తాకుతారా .....చంద్రగారు మీ కవితలో ఎంత వాస్తవముందో .

    ReplyDelete
    Replies
    1. సమాజంలో ఎన్నో సిగ్గుపడవలసిన సంఘటనలు, సినిమా టికెట్ కోసం ఎన్ని గంటలైనా వేచివుంటాము. లైన్లో ఇంటర్నెట్ సెంటర్లో ఎన్ని గంటలైనా వేచివుంటాము, పేకాటాడుతూ ఎంతసేపైనా గడిపేస్తాము, కాలేజీల ముందు ఎంత సేపయినా నిలుచుంటాము. అంత్యేష్టి కార్యక్రమం అంటే, తమ విలువైన సమయం వృధా అయిపోతున్నట్లు ఫీలవుతూ అన్నీ షార్ట్ కట్లే .... కట్టెలు కొని, పేర్చి ..... ఇంత అవసరమా? చనిపోయిన ఆయన చూడవచ్చాడా? ఒక్క స్విచ్ నొక్కితే సరిపోదూ .... " మమ " అనిపిస్తే చాలు. అమ్మ బాధ పడుతుందా? అయితే ఏమిటి .... అసలే టైం లేదు .... ఎంత బిజీ అయిపోయారు .... అసలు వీళ్ళు ఎప్పటికైనా మారతారా, మానవత్వం ఛాయలనయినా తాకుతారా .... చంద్రగారు మీ కవితలో ఎంత వాస్తవముందో. అంటూ,

      ఆవేదనాభరిత ఆవేశపూరిత అక్షర స్పందన .... ఏకీభావన
      ఒక స్నేహ అత్మీయాభినందన
      ధన్యవాదాలు శ్రీదేవి! శుభసాయంత్రం!!

      Delete