ఒక పారిజాతం నవ్వింది.
ఆ నవ్వులో పరిమళం, ఉల్లాసం
ఆలోచనల ఉపశాంతి,
ఆమె చూపుల్లో చిలిపితనం ....
చిత్రం!
"ఏదో అనబోతున్నావు, అనొచ్చుగా!?"
అన్నట్లు .... కొంటె పలుకరింపు.
...............
నవ్వాను ప్రతి పలుకరింపుగా,
నాలో కంగారు, అలజడి.
తెలుస్తూ ఉంది.
నా మనోభావనలు
అమూల్యం,
మనోజ్ఞం అయిన పదాలు
పెదాలమీంచి దొర్లి,
"నేను నిన్ను ప్రేమిస్తున్నా!" అన్న క్షణం
ఆ పదాలు,
నేను, ఆమె సొంతం అయిపోతామని.
మంచి భావుకత ఉంది.
ReplyDeleteకవిత చాలా బాగుంది సర్,
"మంచి భావుకత ఉంది.
Deleteకవిత చాలా బాగుంది సర్,"
భావన చాలా బాగుందని స్పందన
నమస్సులు ఫాతిమా గారు!
అమూల్యమయిన మనోభావాలు ఆసాంతం అలానే ఉంటే బాగుంటుంది చంద్రగారు.
ReplyDeleteఅమూల్యమయిన మనోభావాలు ఆసాంతం అలానే ఉంటే బాగుంటుంది చంద్రగారు.
Deleteఅలానే ఉండాలని ఆకాంక్షే స్పందనగా అభినందన
అభివాదాలు శ్రీదేవీ!