అదే రాత్రి ప్రవృత్తి.
అక్కడ
చీకటి ముసురుకున్న అమర్యాదపు చొరబాటులే అన్నీ.
బలాత్కారపు ప్రవేశాలే అన్నీ.
దోపిడి,
దొంగతనాలు,
విలువలేని ప్రమాణాలు,
సగటు మనిషి నిత్య జీవన సరళి లా ....
అర్ధం లేని, ఊహాజనిత సమీకరణాల తో,
తెలివిని ప్రదర్శించే అడ్డ గాడిదల వ్యర్ధ వ్యాఖ్యానాలు అవి.
అసంబద్ధ పదబంధం లా మారుతూ,
పాయింట్ బ్లాంక్ లో గురిపెట్టిన
ఆ తుపాకీ .... బుల్లెట్
ఆలోచనల్ని తాకి, బలైన చేతనావస్థ
నిద్రావస్థకు లొంగి,
ఉన్నచోటే పడుండిపోతూ .... అది,
నాగరికత నిద్రలోకి జారుతున్న శబ్దం.
"రాత్రి " ఇది, అందమైనదే కాదు అసంబద్దమైనది కూడా, మనిషి పగటి దారిలో ప్ర్యాణిస్తూ పశువుగా మారిన సందర్బాలు ఈఎ రాత్రికే చెందుతాయి,
ReplyDeleteమీ పద బందనాలను అర్దం చేసుకోవటం కొంచం కష్టంగా ఉంది, ్సాహిత్య స్థాయిని పెంచారు,
""రాత్రి " ఇది, అందమైనదే కాదు అసంబద్దమైనది కూడా, మనిషి పగటి దారిలో ప్రయాణిస్తూ పశువుగా మారిన సందర్బాలు ఈ రాత్రికే చెందుతాయి,
Deleteమీ పద బంధనాలను అర్దం చేసుకోవటం కొంచం కష్టంగా ఉంది, సాహిత్య స్థాయిని పెంచారు ...."
సాహిత్య స్థాయి పెరిగింది అనేకన్నా మీలాంటి వారు ఉన్నతంగా చూడటానికి ప్రయత్నిస్తున్నారు అంటే బాగుంటుంది. ఇది ఒక గొప్ప పొగడ్త, చక్కని ప్రోత్సాహక వ్యాఖ్య .... మీ అభినందన స్పందన.
ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభసాయంత్రం!!
మీరు, ఎప్పుడూ ఉన్నత ప్రవర్తన కలవేరే సర్, ఇకపోటే దేవి విష్లేషణ చాలా బాగుంది.
Deleteశుభారుణోదయం మెరాజ్ ఫాతిమా గారు!
Deleteమనిషి వేషభాషలకే నాగరికతను ఆపాదించాడు,నైతికవిలువలను అనాగరికత వైపుకు మళ్ళించాడు .మనిషి పైకి నాగరీకుడు మానసికంగా ఆటవీకుడు అయిపోయాడు.లోపలివాడు "అపరిచితుడు " గా ఉంటున్నాడనిపిస్తోంది చంద్రాగారు ,ఈ కాలంలో ఇరవై నాలుగు గంటలూ రాత్రే .
ReplyDelete"మనిషి వేషభాషలకే నాగరికతను ఆపాదించాడు, నైతిక విలువలను అనాగరికత వైపుకు మళ్ళించాడు. మనిషి పైకే నాగరీకుడు .... మానసికంగా ఆటవీకుడు అయిపోయాడు. లోపలివాడు "అపరిచితుడు" గా ఉంటున్నాడనిపిస్తోంది చంద్రా గారు, ఈ కాలంలో ఇరవై నాలుగు గంటలూ రాత్రే ."
Deleteచిక్కని భావన చక్కని విశ్లేషణ ఏకీభావన అభినందన స్పందన.
ధన్యవాదాలు శ్రీదేవీ! శుభసాయంత్రం!!