Saturday, December 21, 2013

అమంటే ప్రేమను



 










ఎలా దాయను .... ఎలా?
ఈ అనురాగాన్ని
నాలోని ఈ పామరత్వాన్నీ
నా ముఖం పై
కనపడనీయకుండా .... ఎలా దాయను?
గుట్టుగా ఇన్నాళ్ళూ దాచుకునున్న
ప్రియ భావనల్ని .... ఎలా దాయను?
ఆమె వచ్చి
ఎదురుగా నిలబడి, 
"ఎందుకలా!
ఇబ్బందిగా కదులుతున్నావు!
చెప్పు! నేనేమైనా చెయ్యగలనా!?"
అని అన్నప్పుడు
మాటలు రాని మౌనంలో,
బిడియం లో
నిండా మునిగి ఉన్న నేను,
తెరవెనక్కు జారిపోతూ .... ఎలా?
ఎలా దాయను ఆమెను? .... నా ప్రేమను??

2 comments:

  1. నిజంగానే కొన్ని భావాలు దాయడం చాలా కష్టం , కళ్ళలోనే భావాలు కనిపించేస్తాయి కదా మరి .... దాయడం కష్టమే . చంద్రగారు భావం చాలా సున్నితంగా ఉంది .

    ReplyDelete
    Replies
    1. నిజంగా కొన్ని భావాలు దాయడం చాలా కష్టం, కళ్ళలోనే కనిపించేస్తాయి మరి .... భావం చాలా సున్నితంగా ఉంది.
      చక్కని స్పందన స్నేహాభినందన
      ధన్యాభివాదాలు శ్రీదేవి! శుభోదయం!!

      Delete