చీకటి మాటలాడుతుంది.
లోలోపల, వంకరటింకరగా
మెలికలు తిరిగిన
పేగులు, ధమనులు సిరలలో
ప్రవహిస్తున్న రక్తం,
జీర్ణించబడని పదార్ధాలు
ఆరనిమంటల చితి రహశ్యాలు,
భూస్తాపితం అవుతూ
స్పృశించే మైకపు భావనలు
కలల కవ్వింపులు
అరుపులు,
ఆర్తనాదాలు
మిణుగురుల తళతళలు,
కీచురాళ్ళ శబ్దాలు
నెమ్మదిగా తోముకుని
మెరుస్తున్న భయాలు
భయానక కష్టాలు
శ్రుతివ్యత్యయమైన పిడేలు
రాగాలు వినిపిస్తూ
భూతమేదో అడ్డం వచ్చినట్లై
వేగంగా కదులు వాహనం
కీచుమని అరిచి, ఆగి
అంతలోనే ఏమీజరగనట్లు
నాజూకు గా జారి నీడగా మారి
............
పొడుగ్గా పెరిగిన గోళ్ళు,
ఏవో పిచ్చిగీతలు ....
పాతాళం లోంచి, అరుస్తున్నట్లు
ఎవరో స్త్రీ భీతావహ ఆలాపనల్లా
చీకటి మాటలాడుతుంది.
చీకటి మాట్లాడటం లేదు , వేటాడుతుంది.
ReplyDeleteచీకటి మాటలాడటం లేదు, వేటాడుతున్నట్లుంది.
Deleteచిక్కని స్పందన స్నేహాభినందన
ధన్యవాదాలు మెరాజ్ గారు! శుభోదయం! మీకూ మీ పరివారానికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు!!
చీకటి మాటువేసి కాటు వేస్తోంది......ఏమీ ఎరగనట్లు జారుకుంటోంది.....చంద్రగారు పట్టపగలే భయం వేస్తోంటే చీకటి గూర్చి ఇంకేం మాట్లాడతాం .......
ReplyDeleteచీకటి మాటువేసి కాటు వేస్తోంది......ఏమీ ఎరగనట్లు జారుకుంటోంది.....చంద్రగారు పట్టపగలే భయం వేస్తోంటే చీకటి గూర్చి ఇంకేం మాట్లాడతాం .......
Deleteచీకటి పై కన్నా వెలుగు పై కవితలైతే బాగుణ్ణని సూచన ఒక ప్రోత్సాహక స్పందన
ధన్యవాదాలు శ్రీదేవి! నూతన ఆంగ్లసంవత్సర శుభాకాంక్షలు!!
మధ్య పేరాలో అధ్భుత భావం తొణికిసలాడింది
ReplyDelete"మధ్య పేరాలో అధ్భుత భావం తొణికిసలాడింది"
Delete"రాత్తిరి వేళల్లో" కవిత మధ్యపేరా లో తొణికిసలాడిన అద్భుత భావాన్ని దూరం గా ఉండి గమనించి స్పందించిన విధానం బాగుంది
ధన్యమనోభివాదాలు పద్మార్పిత గారు! శుభారుణోదయం!!