మనసుందా? మరి మార్గమూ ఉంది.
అన్వేషించు! తెరిచేఉంచా ....
నా ఎద తలుపుల్ని,
ఎక్కడ్నించైనా సరే, రా!
గుమ్మం వద్దే నిలుచునున్నా .... నీకోసం
ఇక్కడ, నీ స్థానం పధిలంగా ఉంది.
లోపల ఓ చిన్న దీపాన్ని
వెలిగించుంచాను.
వీలు కుదుర్చుకుని,
నీవు నీవుగా వచ్చేప్పుడు
దారి నీకు స్పష్టంగా కనిపించాలని.
ఈ ఎదలో విశ్రమించేందుకు
వచ్చే నీ ప్రయత్నం, మార్గం
సులభం కాదని తెలుసు.
ఎక్కడైనా అడుగులు తడబడి,
నువ్వు త్రుళ్ళిపడినా ....
నమ్మకం తగ్గినా, చెప్పలేను.
నీపక్కన నేనే ఉంటానని.
కాలం తో పాటు పరివర్తన చెందే
కొన్ని ప్రశ్నలు, అనుమానాలు
ఉదయించనేరాదు.
ప్రేమ, నమ్మకం లోనే ఉన్నాయి
నీక్కావల్సిన సమాధానాలు ....
వెదుక్కుంటే.
దయచేసి
ఎద లో నివసించేందుకు
ఆత్మతో ముడివేసుకుందుకు
సమాయత్తం అయి కదిలి వస్తావు కదూ!
కాలం కలిసి రావొచ్చు!
రాకనూ పోవచ్చు!
ఎవరు అర్ధం చేసుకోకనూపోవచ్చు!
ఏవేళైనా ....
నన్ను పిలిచి చూడు
నీ పక్కనే ఉంటాను .... తప్పకుండా. .
కొన్ని కట్టుబాట్లు
పెద్దలు కొందరి ఆశలు, పట్టుదలలు
వారెవరికో చేసిన ప్రమాణాలు
తెంపుకుని రాక తప్పదు .... నాకు.
శబ్దం రాకుండా
ఒక్క మాటా మాట్లాడకుండా
జీవితం లో సెటిల్ కాని కారణమే
ఇన్నాళ్ళూ నాకుగా నేను
తలుపులు మూసి ఉంచేలా చేసింది.
ఇన్నాళ్ళూ నా దృష్టి ని, నా ఆలోచనలను
ఆకర్షణలకు దురంగా ఉంచేల చేసింది.
ఇప్పుడు స్థిరపడ్డాను.
స్థిరపడ్డాకే నువ్వు కనిపించావు.
నీ ఆశలు, ఆశయాల అర్ధం తెలుసుకున్నాకే
ఇష్టం అనిపించింది.
నా లక్ష్యమూ కనిపించింది.
అందుకే, ఈ ఎద తలుపులు తెరిచింది.
వెలుగులు పరిచింది.
నీ మార్గం సుగమం చేసి,
నా హృదయంలో రాణివాసానికి
సాదరంగా ప్రేమాహ్వానాన్ని పంపింది.
జీవితం లో సెటిల్ కాని కారణమే
ReplyDeleteఇన్నాళ్ళూ నాకుగా నేను
తలుపులు మూసి ఉంచేలా చేసింది.
ఇప్పుడు స్థిరపడ్డాను.
స్థిరపడ్డాకే నువ్వు కనిపించావు.
అందరూ అలా ఆలోచిస్తే సమాజంలో ఆదర్శవంతమయిన కుటుంబాలే ఉంటాయి . ఊహ ఇంత సంతోషాన్ని ఇస్తుంటే వాస్తవం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ..... అటువంటి పరిపక్వమయిన ప్రేమాహ్వానాన్ని కాదనే వారు ఎవరుంటారు చంద్రగారు . కవిత చాలా బాధ్యతగా ఉంది .
అందరూ ఇలా ఆలోచిస్తే సమాజంలో ఆదర్శవంతమయిన కుటుంబాలే ఉంటాయి. ఊహ ఇంత సంతోషాన్ని ఇస్తుంటే వాస్తవం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో .... ఇటువంటి పరిపక్వమయిన ప్రేమాహ్వానాన్ని కాదనే వారు ఎవరుంటారు చంద్రగారు. కవిత చాలా బాధ్యతగా ఉంది.
Deleteఏకీభావన స్పందన ఒక చక్కని ప్రోత్సాహకాభినందన
ధన్యవాదాలు శ్రీదేవీ! సుప్రభాతం!!
కొన్ని వేల కారణాలు పెనుబూతాలై ప్రేమికుల్ని కబళించాలని చూస్తాయి.
ReplyDeleteఎన్నో సందిగ్దాలు వెన్నాడతాయి. సామాజిక కట్టుబాట్ల వలతాళ్ళను తెంపుకొని ప్రేమికులు దూరంగా పరుగెడతారు, కొద్దిరోజులే.... తిరిగి వారే సామాజిక వలతాళ్ళ్ను కొరికిన చోట వచ్చి ముడిపడతారు.
ప్రేమికులంతా ప్రేమను ప్రోత్సహిస్తే. ఇప్పుడు జగమంతా సగబాగం ప్రేమతో నిండి ఉండేది.
ప్రేమంటే అదో జంజాటం, అదో తెలియనితనం అనిపించేలా పాటుపడి ఫలితాఅన్ని సాదిస్తుందీ లోకం.
మీ కవితలు అలోచిపచేయటమే కాదు,ఆర్గ్యూ చేయిస్తున్నాయి, సర్, ధన్యవాదాలు.
ఎన్నో కారణాల పెనుబూతాలు. ఎన్నో సందిగ్దాలు వెన్నాడుతూ కట్టుబాట్ల తాళ్ళను తెంపుకొని ప్రేమికులు దూరంగా పరుగెట్టగలిగింది కొద్దిరోజులే .... నిజంగా ప్రేమను ప్రోత్సహిస్తే. ఎప్పుడో ఈ జగమంతా ప్రేమతో నిండి ఉండేది. నేడు ప్రేమంటే .... జంజాటం, అదో తెలియనితనం అనిపించేలా పాటుపడి ఫలితాన్ని సాదిస్తుందీ లోకం.
Deleteమీ కవితలు అలోచింపచేయటమే కాదు, ఆర్గ్యూ చేయిస్తున్నాయి, సర్, ధన్యవాదాలు. అంటూ,
ఒక చక్కని స్పందన .... ఏకీభావన
స్నేహ అత్మీయాభినందన
ధన్యాభివాదాలు మెరాజ్ గారు! శుభసాయంత్రం!!