మసక మసగ్గా
వెలుగు కిరణాలు
ఆ తూరుపు కొండల్లోంచి తొంగి చూస్తూ
....................
పాలవాడి అరుపులు
కుళాయిల్లోంచి జారుతున్న నీటి శబ్దాలు
కోడి కూతలు
ఆడపడుచుల వంటగది ద్వనులు
తరుముకొస్తున్న భావనలు అవి.
...................
చేతులు బార్లాచాచి
గట్టిగా ఊపిరి పీల్చుకుని, విడిచి
చేతులు మడిచి
అరచేతులు ఒకదానితో ఒకటి రుద్దుకుని
ఆ వెచ్చదనంతో .... కళ్ళను తాకి
బద్దకాన్ని సుతారంగా సాగనంపేలోగా ....
దూరంగా గణగణ మని
ఆలయంలో గంటలు మోత.
మౌనంగా నిలబడ్డాను.
అంతా సవ్యంగానే జరగాలని,
................
పొగ మంచు కమ్ముకునే ఉంది.
అప్పుడు,
విషాదం చ్చాయలో ....
నిద్దుర బద్దకం వీడాల్సిన అఘత్యం
నా ఒంటరి పోరాటం
చైతన్యావశ్యకతను గుర్తుచేస్తూ.
పాపం మన కోసం , మనతో కలసి పని చేస్తున్నందుకు వాటికీ మన భావాలతో పాటు మన ఒంటరితనం కూడా అంటుకుంది . బాగుంది చంద్రగారు భావ ప్రకటన.
ReplyDelete"పాపం మన కోసం, మనతో కలసి పని చేస్తున్నందుకు వాటికీ మన భావాలతో పాటు మన ఒంటరితనం కూడా అంటుకుంది. బాగుంది చంద్రగారు భావ ప్రకటన."
Deleteకాలానికైనా తప్పదు.
వీలుంటే .... అంటగట్టగలం బద్దకాన్ని!
వీలుకాకే ....?
ధన్యవాదాలు శ్రీదేవి! చక్కని స్పందన
బద్దకం అంటుకోదు బాద్యత ఉంటే,
ReplyDeleteకానీ ప్రక్రుతి మనిషిని కొంత తనవైపుకు లాక్కుంటుంది.
మంచి భావుకత ఉంది, బద్దకంతో పాటు:-))
బద్దకం అంటుకోదు బాద్యత ఉంటే, కానీ ప్రకృతి మనిషిని కొంత తనవైపుకు లాక్కుంటుంది. మంచి భావుకత ఉంది, బద్దకంతో పాటు:-)) .... బావుంది స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
Deleteధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!