గులాబీ పువ్వును,
వేళ్ళ మధ్య పట్టుకుని ....
రేకుల్ని విడదీస్తూ లెక్కిస్తున్నావు.
కారణం ఉందంటావా?
ఎమిటంటావు?
మార్పు వస్తుందని
ఎదురు చూస్తున్నావు.
ఊహించని అదృష్టం ఏదో వచ్చి
తలుపు తడుతుందని,
మీనమేషాలు లెక్కబెడుతున్నావు.
అవసరమా!?
కాలం వృధా అయిపోతుంది.
ఏదైనా చేసేద్దువు కాని .... రా!
కొన్నినాళ్ళయినా జ్ఞాపకం ఉండేలా
కాలచక్ర గమనంలో ....
మిగిలుండేలా, చిన్న మార్పుకయినా
కారణం అవుదాం రా!
శిల్పాన్ని చూపించి ఓట్లడిగే
రాజకీయం వద్దు నీకు.
కలల శిల్పివి నీవు
నీ కలలకు రూపాన్నియ్యి!
నాలుగు రోడ్ల కూడలిలో ప్రతిష్టాపన గా
ఆచరణ క్రమం ను ఆవిష్కరించు.
మార్పు, అరుణ రాగమై అడుగులేస్తూ,
రా! .... రా ముందుకు!
నేను,
నీలో ప్రజ్వలనాన్ని!
చూస్తున్నావా! గమనిస్తున్నావా?
సముద్ర మధనానికి వేళయ్యిందని.
పాపం చాలమంది త్వరపడి ఏదో ఒకటి చేయకుండా ,తెలివిగా ఏం చేద్దామా అని ఆలోచిస్తూ.... సగం జీవితాన్ని తెల్లవార్చేస్తున్నారు .చంద్రగారు బాగుంది కవిత.
ReplyDelete"పాపం! చాల మంది త్వరపడి ఏదో ఒకటి చేయకుండా, తెలివిగా ఏం చేద్దామా అని ఆలోచిస్తూనే .... సగం జీవితాన్ని తెల్లవార్చేస్తున్నారు .చంద్రగారు బాగుంది కవిత."
Deleteచాలా బాగుంది స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
ధన్యమనోభివాదాలు శ్రీదేవి!