Wednesday, December 18, 2013

నాది నిజమైన ప్రేమే



 

















నిజంగా నాది నిజమైన ప్రేమే
ఓ అమ్మాయీ!
నమ్ము!
ఈ భావనల్లో
ఈ మనసులో ఉన్నది నీవే!
ఆట అనుకుంటున్నావేమో నా మాటల్ని
నీ సాన్నిహిత్యం
చేరువ కావడం కోసమని
....
నిజంగా నేను దిగులుచెందటం లేదు,
నీవు ప్రేమించవేమో అని.
నా మనసుకు తెలుసు
నా ప్రేమ స్వచ్చమైనదే అయితే
నీకూ ప్రేమించకతప్పదని.
నీ వద్ద ఉన్నదంతా
నిన్ను నీవుగా
సమర్పించుకునే రోజు వస్తుందని నమ్ముతున్నా!
....
నేను నేనుగా నిర్మలంగా
నీ పై నా ప్రేమ సడలకుండా ఉంటే,
నీవూ నేనూ వేరు కాదని నువ్వనుకునే రోజొస్తుందని.
....
ఇప్పుడు
నీవు కోరుకునేదీ అదే అయినా ....
కొంత సమయం పడుతుంది నీకు,
నీ ప్రేమను ప్రకటించడానికి.
అప్పటివరకూ పల్లవించి ఉన్న
నా ప్రేమ పరిమళాలు పంచుతూ ఉంటుంది.
....
నిరాశోపహతుడ్నౌతాననుకోకు.
నీకూ వ్యవది అవసరం అనుకుంటా
నీకుగా నీవు నచ్చజెప్పుకోవడానికి.
....
ఒక్కసారి
నచ్చి మనసిచ్చాక
నా మాటే నీ మాట అంటావని తెలుసు.
నాకు నమ్మకం
అప్పుడు
మన మనసులు మమైకం అయి
సాహచర్య మాధుర్యం మనం చవిచూస్తామని.

4 comments:

  1. "ఓ ప్రేమికుని గా.... ట్టి నమ్మకం" వేచి చూడటమే..
    బాగుంది మంచి భావుకత. అభినందనలు సర్ జి

    ReplyDelete
    Replies
    1. "ఓ ప్రేమికుని గా.... ట్టి నమ్మకం" వేచి చూడటమే .... బాగుంది మంచి భావుకత. అభినందనలు సర్ జి"
      బాగుంది స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete
  2. పరిమళాలు పంచే ప్రేమతో జీవిత సాహచర్యం చాలా బాగుంటుంది చంద్రగారు.బొమ్మ అద్భుతంగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. పరిమళాలు పంచే ప్రేమతో జీవిత సాహచర్యం చాలా బాగుంటుంది చంద్రగారు. బొమ్మ అద్భుతంగా ఉంది.
      ఏకీభావన స్పందన అభినందన
      ధన్యాభివాదాలు శ్రీదేవీ!

      Delete