Friday, December 13, 2013

నువ్వేనా ఆ నేస్తానివి?




 







భుజానికి అయిన గాయం
పుండై సలుపుతుంది.
గాయం కదిలినట్లై,
..................
తటపటాయిస్తున్నాను.
నీవు అడిగినా
భారం దించుకోవాలని ఉన్నా
న్యాయమా అని,
..................
పుండు పై కారం చల్లినట్లు
నొప్పి ఎక్కువైనప్పుడు,
పరామర్శించి ....
నా బాధను చూడలేని,
ఒక మంచి మనిషి తోడు కోసం,
...................
నా సమశ్యల్ని పంచుకుని
శ్రద్దగా వినే
ఒక మంచి మనసు నీడకోసం
వెదుక్కుంటున్నాను ....
.....................
నా ఆత్మను తృప్తి పరిచి
నా తడి కళ్ళను తుడిచే
స్నేహ హస్తం ఎక్కడుందా అని.
.....................
చింతల్ని నా నుంచి
ఋణం గా తీసుకుని
సేదదీర్చే
అమృతహస్తం కోసం
.......................
నా శారీరక
సమశ్యల్ని, రుగ్మతల్ని తప్ప
అన్నింటినీ పంచుకునే
ఒక మంచి నేస్తం కోసం
ఎక్కడైనా ఎదురొస్తుందేమో అని.

4 comments:

  1. అటువంటి అమృత హస్త నేస్తం ఉంటే , చింతలు చీకి పోతాయి ,మానసిక / శారీరక రుగ్మతలు మటుమాయమవుతాయి . అమృత హస్తానికి అంత అద్భుత శక్తి ఉంటుంది మరి . ఏదేమైనా అటువంటి నేస్తం దొరికితే అది దేవుని వరమే . ఆశతో సాధించలేనిది లేదు . మీ కవిత స్నేహం కోసం ఆరాటపడే మనసును సజీవంగా చూపింది చంద్రగారు .

    ReplyDelete
    Replies
    1. "అటువంటి అమృత హస్తమున్న నేస్తం ఉంటే, చింతలు చీకి పోతాయి, మానసిక / శారీరక రుగ్మతలు మటుమాయమవుతాయి. అమృత హస్తానికి అంత అద్భుత శక్తి ఉంటుంది మరి. ఏదేమైనా అటువంటి నేస్తం దొరికితే అది దేవుని వరమే. ఆశతో సాధించలేనిది లేదు. మీ కవిత స్నేహం కోసం ఆరాటపడే మనసును సజీవంగా చూపింది చంద్రగారు."
      చాలా చక్కని ప్రోత్సాహక అభినందన స్పందన. ప్రతి మనిషి ఒక అమృత హస్తమున్న నేస్తం లా మారితే, సమాజంలో చింతలు చీకి పోతాయి.
      ధన్యవాదాలు శ్రీదేవి.

      Delete
  2. స్వార్దం కదా, బాదను మాత్రమే పంచుకోమనటం,
    అయినా ఆ ప్రయత్నం అవసరమే లేదు,
    స్నేహితురాలయితే(ఆ నేస్తం) ఓదార్చేందుకు ముందుకొస్తుంది. ఆడ మనస్సులో తల్లిస్థానం ఎప్పుడూ ఉంటుంది. ప్రతి మగవాని వేదననూ తన స్నెహ మాదుర్యంతో తుడిచివేస్తుంది స్త్రీ, కానీ అదే ఓదార్పుకొసం తపిస్తుంది, అందుకే గుండెను అర్పిస్తుంది.
    ప్రతి చోటా... ఆలిగా, చెలిగా,చెల్లిగా, తల్లిగా, ఇంకా.ఇంకా... ఎన్నో బంధాలలో...
    మీరు రాసిన కవితలో్నూ ఆతనికి స్వాంతన కావలసిందీ " ఆమె " నుంచే.... ఎంతైనా పురుషాక్ష్రరాలు కదా(మన్నించాలి విమర్శించినందుకు)

    ReplyDelete
    Replies

    1. "స్వార్దం కదా, బాదను మాత్రమే పంచుకోమనటం, అయినా ఆ ప్రయత్నం అవసరమే లేదు, స్నేహ హస్తం స్త్రీ ఎప్పుడూ ఓదార్చేందుకు ముందుకే వస్తుంది. ప్రతి ఆడ మనస్సులో తల్లిస్తానం ఎప్పుడూ ఉంటుంది. మగవాని వేదననూ తన స్నేహ మాధుర్యంతో తుడిచివేస్తుంది, కానీ అదే ఓదార్పు తిరిగి పొందడం కొసం తపిస్తుంది, అందుకే గుండెను అర్పిస్తుంది. ఒక .... ఆలిగా, చెలిగా, చెల్లిగా, తల్లిగా, ఇంకా .... ఇంకా.... ఎన్నో బంధాలలో.... ఎన్నో రూపాలలో స్వాంతనను కల్పిస్తూ ....
      చిన్న శ్లేష .... ఎంతైనా పురుషాక్షరాలు కదా అని,"
      స్త్రీ వల్ల పొందే స్వాంతనను గుర్తించి ఆకాంక్షించి అభిలషించిన అక్షరరూపం ఈ కవిత. అభిశంసించడం తగదేమో. నిజమే మీరన్నట్లు ప్రకృతి ఎన్నో రూపాల్లో పురుషుడి అభ్యున్నతికి సహకరిస్తున్నా పురుషుడు మాత్రం ప్రకృతిని హేళనే చేస్తున్నాడు.
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete