Sunday, December 1, 2013

నీవూ నేనూ

 
నా ఊహాల్లో
అప్పుడప్పుడూ ఒక దృశ్యం చూస్తుంటాను.
జంటగా, అక్కడ .....
చేతిలో చెయ్యేసుకుని నీవూ, నేనూ
ఊరవతల టూరింగ్ టాకీసులో ....
పాత సినిమా చూస్తున్నట్లు,
రావి చెట్టుకు వ్రేలాడేసిన ....
ఉయ్యాల ఊగుతున్నట్లు,
రోజంతా నీ కేరింతల నవ్వులు నేను వింటున్నట్లు,
నేను గమనించట్లేదనుకుని ....
అప్పుడప్పుడూ నీవు జారవిడుచుకునే
ఆ ముసి ముసి నవ్వుల అమాయకత్వాన్ని
ఓరగా గమనించి అమూల్యానందం నేను పొందుతున్నట్లు, 
పదే పదే గమనిస్తుంటాను నిన్ను.
నిజానికి నా తపస్సు, నా ఆశ, నా నమ్మకం, నా ఆరాటం
నీవు కళ్ళుమూసుకునున్నప్పుడు
నీ మది ఆలోచనలు,
ఎద ప్రకంపనలకు కారణం నేను మాత్రమే కావాలని.

2 comments:

  1. అప్పుడప్పుడూ నీవు జారవిడుచుకునే
    ఆ ముసి ముసి నవ్వుల అమాయకత్వాన్ని
    ఓరగా గమనించి అమూల్యానందం నేను పొందుతున్నట్లు, ...... వహ్ అందమైన ఊహ.
    బాగుంది సర్.

    ReplyDelete
    Replies
    1. అప్పుడప్పుడూ నీవు జారవిడుచుకునే .... ఆ ముసి ముసి నవ్వుల అమాయకత్వాన్ని
      ఓరగా గమనించి అమూల్యానందం నేను పొందుతున్నట్లు, ......
      వహ్! అందమైన ఊహ.
      బాగుంది సర్. .... బాగుంది స్వచ్చమైన అభినందన స్పందన
      నమస్సులు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete