Sunday, December 29, 2013

చిరు స్వార్థములే



 

















ఈ భూమి, ఈ పచ్చదనం,
ఈ నీరు
ఆ ఆకాశం,
ఆ మబ్బుల గుంపుల కదలికల
జారుతున్న వర్షం చినుకుల్లో .... ప్రకాశం
..........
తూరుపు దిశ నుండి
గుంపులు గుంపులుగా కదిలి
ఒకదానిని ఒకటి రాసుకుంటూ, పెళపెళలాడే
ఆ మేఘ గర్జనలు, ఉరుముల .... శబ్దాలు
................
మేఘాలతో ముచ్చట్లడుతూ కదులుతున్న
ఆ చల్లని గాలి
మదిని చల్లబర్చి, శ్వాసై ఎదను చేరి,
సంబ్రమంగా తలెత్తి చుసేలా చేస్తున్న
గగనంలో ఆ మెరుపు .... వెలుగులు

2 comments:

  1. ఉదయాన్నే ఓ అద్భుతమైన ప్రకృతి వర్ణనతో చిరు స్వార్ధంగా పలకరించినందుకు సంతోషం చంద్రగారు చిత్రం,కవిత చాలా బాగున్నాయి.

    ReplyDelete
    Replies
    1. "ఉదయాన్నే ఓ అద్భుతమైన ప్రకృతి వర్ణనతో చిరు స్వార్ధంగా పలకరించినందుకు సంతోషం చంద్రగారు!
      చిత్రము, కవిత చాలా బాగున్నాయి."

      ఔనా! చాలా బాగుంది మీ స్నేహాభినందన చక్కని చిరు స్పందన
      ధన్యవాదాలు శ్రీదేవి! శుభోదయం!!

      Delete