Saturday, December 14, 2013

శిఖరారోహణ







 



ఒక భూమి ప్రయాణం లాంటిదే ఈ జీవనయానం
బయలుదేరిన చోటుకే తిరిగిరాకతప్పదు.
తనచుట్టూ తాను తిరుగుతూ .... గుండ్రంగా భూమి
కొన్నిచోట్ల సమతలంగా, కొన్ని సమయాల్లో సులభంగా
అప్పుడప్పుడూ, అక్కడక్కడా .....
ఆ మొండి మైదానాలు, ఆ దూరాభారాలు
ప్రేమానురాగభావాలు, కష్టతరమై నిలువెత్తున
మీదమీదకు వచ్చిపడే ఆ సమశ్యలు .... బాధలు,
ఆ నిలువెత్తు సమశ్యల శిఖరాలు
అదిరోహించగలిగిన క్షణాల్లో మాత్రం .... ఒక్కోసారి,
అది ఒక అద్భుత పక్షి వీక్షణ.
అది ఒక అత్యున్నత జీవనావిష్కరణ,
ఆ క్షణాల్లో కళ్ళు సంతోషంతో నిండిపోవడం,
గాలిలో ఎగిరిపోతున్నట్లు అనిపించడం,
ఆ విజయోత్సాహాన్ని గళమెత్తి పాడాలనిపించడం,
ఆ ఆనందం అందరికీ పంచుకోవాలనిపించడం ....
ఒక పల్లవించిన చైతన్య సుమం .... ఆ భావన.
అది అంతటితో ఆగని ప్రయాణం ..... అది ఒక పురోగమనం.
ఉన్నత శిఖరాల మీంచి, మరోవైపు నుంచి క్రిందికి దిగివస్తూ,
దారి వెంబటి ఆదర్శ కేతనాలెగురవేస్తూ, కదులుతూ ....
ఆ పాదాలు తాకి శిల అహల్య అవుతూ, అది ఒక
అవిశ్రామ గమనం .... అనుభవపాటాలకు అక్షరరూపాన్నిస్తూ పోతే,

4 comments:

  1. అధ్బుతమైన ఆ ప్రపంచం వెనుక అనూహ్యమైన లోయలుంటాయనీ, అరుదైన సన్నివేశాలు కదిలిస్తాయనీ తెలీక కాదు,మీరన్నట్లు అవిశ్రామ గమనం అంతే, మీ టపా చాలా సందేశనాత్మకంగా ఉంది,

    ReplyDelete
    Replies
    1. అధ్బుతమైన ఆ ప్రపంచం వెనుక అనూహ్యమైన లోయలుంటాయనీ, అరుదైన ఆ సన్నివేశాలు కదిలిస్తాయనీ తెలీక కాదు, మీరన్నట్లు అవిశ్రామ గమనం అంతే, మీ టపా చాలా సందేశనాత్మకంగా ఉంది. .... చాలా చక్కని విశ్లేషణ స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు మెరాజ్ గారు! శుభసాయంత్రం!!

      Delete
  2. నిలువెత్తు శిఖరాలు అధిరోహించినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో ,అగాధాలలో జారినప్పుడు కూడా అంతే ఆత్మస్థైర్యం తో సాగాలి . అప్పుడే ఆ అవిశ్రామగమనం మరెందరికో ఆదర్శం అవుతుంది చంద్రగారు. బాగుంది

    కవిత .







































    నిలువెత్తు శిఖరాలు అధిరోహించినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో ,అగాధాలలో జారినప్పుడు కూడా అంతే ఆత్మస్థైర్యం తో సాగాలి . అప్పుడే ఆ అవిశ్రామగమనం మరెందరికో ఆదర్శం అవుతుంది చంద్రగారు. బాగుంది కవిత .

    ReplyDelete
    Replies
    1. శిఖరారోహణ చేసినవారు తమ అనుభవాల్ని పంచుకునేవారు .... కష్టించి స్వేదించడం ద్వారా ఆ ఎత్తులో తాము పొందిన అద్భుత పక్షి వీక్షణానుభూతిని, ఆ అత్యున్నత జీవనావిష్కరణ లక్ష్యాలను ప్రేరేపించడం లో ఉన్న గొప్పతనాన్ని .... స్పందన లో చూసి సంతోషంగా ఉంది.
      ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!

      Delete