దృష్టికి అడ్డుపడుతూ ఉన్న
గొంతులోంచి మాటలు పెగలడం లేదు.
అతని పెదాలూ తడారిపోయాయి
మరింతగా ఏడ్చేందుకు
కన్నీళ్ళూ లేవు.
ఆ బుగ్గలపై చారికలై మిగిలాయి .... మినహా
అక్షరాలు, పదాలు తట్టడం లేదు.
రాయడానికి
ఎప్పుడూ భావాలను స్రవించే
అతని కలం
సిరా ఆవిరై
అతని మది మూగబోయింది.
అంతా నిశ్శబ్దం
అతని,
హృదయ కుహరం లో
హృదయం కొట్టుకుంటున్న శబ్దం
వినిపించడం లేదు.
హృదయం బ్రద్దలైన వేదన
ప్రేమ నిట్టూర్పులే తప్ప
కొన ఊపిరి పీలుస్తూ, తపిస్తూ
నీవు కాదనుకున్న అతను
ఇప్పుడు
ఒక నామ మాత్రపు భగ్నప్రేమికుడు.
చంద్రగారు ఒక భగ్నప్రేమికుడి బాధను చాలా బాగా విశ్లేషించారు మీ సిరాతో..
ReplyDeleteచంద్రగారు ఒక భగ్నప్రేమికుడి బాధను చాలా బాగా విశ్లేషించారు మీ సిరాతో....
Deleteచాలా బాగుంది స్నేహాభినందన స్పందన
ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!
భగ్నప్రేమికుడు చాలా బాగుంది చంద్రగారు.
ReplyDeleteభగ్నప్రేమికుడు చాలా బాగుంది చంద్రగారు.
Deleteబాగుంది స్నేహాభినందన స్పందన
ధన్యవాదాలు హిమజ ప్రసాద్ గారు! శుభమధ్యాహ్నం!!