Saturday, March 8, 2014

దరికి చేరాలనే




 








ఎందరో భగ్న ప్రేమికుల
జీవితాల
చరిత్రల సమాధుల్లో
ప్రేమించేందుకు తొందర తగదనే
వివేకం సారాన్ని
కాదనరాదని తెలిసీ .... పడిపోయాను
నీ ప్రేమ లో
పడిన చోటే ఉండాలనిపించేసరికి 
ప్రేమ నేరం కాదని
సర్ధి చెప్పుకుంటున్నాను.
బయటపడలేక .... ప్రాకృతికం అని, 


ఏ నది
ఎక్కడ ఆరంభం అయినా
ఆ నదీ ప్రవాహం
ఆ నది గమ్యం సాగరమే .... ప్రియా!
నా జీవితం గమ్యం
అర్ధం నీవే కావడం
దైవ నిర్ణయం ....
యాదృచ్ఛికం అని అనుకోలేను.
నా మనోభావోదృతి అని తెలిసే అడుగుతున్నా!
నా చెయ్యందుకో అని
నన్నూ, నా జీవితాన్ని నీదనుకో అని
నిశ్చలన సాగరంలో
తేలు అలను నన్ను దరికి చేర్చుకోమని

2 comments:

  1. ఆహా!ఏం యాదృశ్చికం చంద్రగారు ,బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ఆహా! ఏం యాదృశ్చికం చంద్రగారు,
      బాగుంది.
      బాగుంది అభినందన స్పందన
      ధన్యాభివాదాలు శ్రీదేవీ!

      Delete