తెలుసుకోవాలనుంది.
వినాలనుంది ఎవరైనా వివరిస్తే
ఈ భయాన్ని అధిగమించడం ఎలాగో ....
చెప్పే ప్రతి అక్షరం, పదాన్ని
మనసులో ముద్రించుకుంటాను.
కాస్తంత సులభమైన ప్రక్రియను
సూచిస్తే బాగుంటుంది.
అలాగే,
చెప్పేప్పుడు మరిచిపోవద్దు!
ఏ ఘనకార్యాన్నైనా సాదించేందుకు
ధైర్యం, వివేకం
ఎంతో అవసరమని గుర్తు చెయ్యడం!
తిరస్కరణంటే నాకు భయం!
చెప్పాలి ఎవరైనా ....
భయపడితే, నిజమైన ప్రేమను కోల్పోతానని
ధైర్యం, ప్రేమ ఉంటేనే ఆనందం అని,
పొందేందుకు అవసరమైతే పోరాటం చెయ్యాలి అని,
ఒప్పించాలి .... నన్ను
నాలోని భావనల పద శబ్దాలు
బిగ్గరగా వినిపించక్కరలేకపోయినా,
బలహీనంకాకుండా ఉండాలని ....
నాకు సహాయం చెయ్యాలి ఎవరైనా
నా మనసును, నా అంతరంగాన్నీ వినే
ఒక మంచి లక్షణాన్ని నాలో పెంచేందుకు.
రక్షించాలి .... నన్ను
చెప్పుడుమాటల ప్రభావం మీద పడకుండా
అవి నాకు వినాలని లేదు.
ఎవరైతే అర్ధం చేసుకోకుండా
నాపై అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారో .... వారి నుంచి
.................
నా చెయ్యందుకుని,
నాకొక మంచి మార్గాన్ని చూపించాలి.
నా మనసుకూ, నాకూ అనిపించేలా
ఎట్టిపరిస్థితుల్లోనూ అనుసరించాల్సిన మార్గం
అదే అని అనిపించేలా
నా ముఖం పైకి ధైర్యాన్ని ఊదాలి ఎవరైనా
ఆ వెచ్చదనం నా కళ్ళను తెరిచేవరకూ
నా చెయ్యందుకుని,నాకొక మంచి మార్గాన్ని చూపించాలి." ఈగో" కి స్థానం లేకుండా ఇటువంటి భావం మనసులో కలిగిందంటే....... ఖచ్చితంగా మార్గాన్ని చూపించే వారు చేయందుకుంటారు.చంద్రగారు చాలా బాగుంది.
ReplyDeleteనా చెయ్యందుకుని, నాకొక మంచి మార్గాన్ని చూపించాలి."
Deleteఈగో" కి స్థానం లేని ఇటువంటి సమర్పణాభావం మనసులో కలిగిందంటే....... ఖచ్చితంగా మార్గాన్ని చూపించే
నేస్తాలు ముందుకు వస్తారు .... చేయందుకుంటారు. చంద్రగారు కవిత చాలా బాగుంది.
చాలా బాగుంది సూక్ష్మ విశ్లేషణ .... స్నేహ ఆత్మీయాభినందన స్పందన
ధన్యవాదాలు శ్రీదేవీ! శుభసాయంత్రం!!
మంచి భావన గుబులెక్కిన గుండెకి
ReplyDeleteస్వయం సమాధాన పడుతూ
ఇతరులకీ ఆ చొరవ పంచుతూ
ప్రేమాభిమానాల్ని పంచుటలో ఉన్న
ఏ అహమూ లేని స్నేహ తత్వమే
అసలైన ధైర్యమూ ఆసరా.
మీ నివేదనలోనే అన్నీ నిక్షిప్తమై ఉన్నాయి చంద్రగారు.
ఒక మంచి భావన .... ఈ కవిత
గుబులెక్కిన గుండెతో సమాధాన పడుతూ .... ఇతరుల చొరవ, ప్రేమాభిమానాల ఆసరాతో .... అహం లేని అస్తిత్వం స్నేహ తత్వంతో .... నిజం .... మీ నివేదనలోనే అన్నీ నిక్షిప్తమై ఉన్నాయి చంద్రగారు..
ఎంతో లోతైన సూక్ష్మ పరిశీలన .... స్నేహాభినందన స్పందన
ధన్యవాదాలు జానీ పాషా గారు! శుభసాయంత్రం!!
" ఎవరైతే అర్ధం చేసుకోకుండా
ReplyDeleteనాపై అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారో ...." ఈ వాఖ్యాలలోనే ఉంది అర్దం చేసుకొనే శక్తి అవతలివారికి లేదని,
అలాంటివారి నుండి రక్షణ కావాలి.
అద్భుతమైన భావాలు పలికించారు కవిత ఎన్నిసార్లు చదివినా ఇంకా చదవాలని ఉంది. అభినందనలు సర్.
"ఎవరైతే అర్ధం చేసుకోకుండా
Deleteసాటి మనిషిపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారో ...."
ఈ వాఖ్యాలలోనే ఉంది అర్దం చేసుకొనే శక్తి అవతలివారికి లేదని,
అలాంటివారి నుండి రక్షణ కల్పించాలి.
అద్భుతమైన భావాలు పలికించారు
కవిత ఎన్నిసార్లు చదివినా ఇంకా చదవాలని అనిపించేలా వుంది.
అభినందనలు సర్.
ఎంతో గొప్ప కాంప్లిమెంట్ .....
పదునైన పదాల సామాజిక కవయిత్రి సూక్ష్మ విశ్లేషణలో .... అభినందన స్పందనలో
ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభసాయంత్రం!!