Wednesday, March 26, 2014

నా మనిషివే నీవు




నిన్నటి వరకూ
కలలోనూ కనలేకపోయాను.
కానీ, ఇక్కడ,
నా సమీపం లోనే నవ్వులు పూస్తూ .... నీవు,
ఎంతో పరిచయం ఉన్న దానివిలా
నమ్మలేకపోతున్నాను.
ఇప్పుడు,
నేను నిన్ను స్పర్శించగలుగుతున్నానని.
ఏ గారడీ చేయకుండానే రప్పించుకోగలిగానని
ఇప్పుడు,
ఇక్కడ .... నా పక్కనే నీవు
నా జీవిత గమ్యం
నా ఆశయం
నా కోరికలన్నీ అల్లుకునున్న జీవన మాధుర్యానివిలా .... 
అందుకేనేమో ....
ఇప్పుడు నాలో,
నా జీవితం పరిపూర్ణతను పొందినంత ఆనందం!



చిత్రం!
ఏ కోణం లో చూసినా
నీ లక్షణాలు ఎంతో వైవిధ్యం గా
నన్ను ప్రతిబింబించని విధంగా .... ఉన్నాయి.
నీవు నా పక్కనే ఉన్నావు.
ఉంటావు!?
ఉండొచ్చని వింత నమ్మకం!
నిజమైతే ఎంత అదృష్టవంతుడ్ని నేను.

4 comments:

  1. ఏ కోణం లో చూసినా
    నీ లక్షణాలు ఎంతో వైవిధ్యం గా
    నన్ను ప్రతిబింబించని విధంగా .... ఉన్నాయి.
    తన ఉనికిని కాపాడుకుంటూ చాలా బాగుంది చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. ఏ కోణం లో చూసినా, నీ లక్షణాలు ఎంతో వైవిధ్యం గా నన్ను ప్రతిబింబించని విధంగా .... ఉన్నాయి.
      తన ఉనికిని కాపాడుకుంటూ చాలా బాగుంది చంద్రగారు.
      చాలా బాగుంది స్నేహ ఆత్మీయాభినందన స్పందన
      _/\_లు శ్రీదేవీ!

      Delete
  2. పక్కనే ఉన్నావనే నమ్మకమూ, ఆశా, చాలా బలమైనవి,
    చాలా బాగుంది, మీ మానసిక విష్లేషాత్మక కవిత.

    ReplyDelete
    Replies
    1. పక్కనే ఉన్నావనే నమ్మకమూ, ఆశా, చాలా బలమైనవి,
      చాలా బాగుంది,
      మీ మానసిక విశ్లేషణాత్మక కవిత.

      చక్కని స్నేహ ఆత్మీయాభినందన బాగుంది స్పందన
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! సుప్రభాతం!!

      Delete