Thursday, March 20, 2014

చెయ్యందించేవారుంటే?




 






 



రక్తసంబంధమే బంధమని
అనుకోలేము
అవసరమని
బంధం బలోపేతం కావడానికి
కాని సోదరుల మధ్య
జీవితం ద్వారా

తరచూ పంచుకుంటూ
కలల్నీ, కవ్వింపుల్నీ
నవ్వుల్ని .... ఆనందాన్నీ
బాధల్ని , కన్నీళ్ళనూ
విజయాల్నీ,
అపజయాల్నీ .... అనుభవాల్నీ

మాటలే అన్ని వేళలా
మాధ్యమం కానక్కర్లేదు
అభిప్రాయాలు పంచుకునేందుకు
తల ఊపి చెప్పొచ్చు
కళ్ళతో అంగీకారం తెలపొచ్చు 
పరిపూర్ణంగా అర్ధం చేసుకునుంటే



మనో భావనల అర్ధాలు అవసరాలు
మనుష్యుల జీవితాల్ని కలుపుతూ
సాగే ప్రయాణం .... జీవితం లో.
అప్పుడప్పుడు జారి
ప్రమాదవశాత్తు .... కలిసి జీవించే
సహజీవనం పొందటమే ఒక వరం

4 comments:

  1. తుం జొ పకడ్ లొ హాత్ మేరా దునియ బదల్ సక్తాహు మై.....పాట గుర్తుకొచ్చింది చంద్రగారు.అటువంటి చేయి ఉంటే ఏమైనా సాధించవచ్చు చిరునవ్వుతో.

    ReplyDelete
    Replies
    1. తుం జొ పకడ్ లొ హాత్ మేరా దునియ బదల్ సక్తాహు మై.....పాట గుర్తుకొచ్చింది చంద్రగారు.
      అటువంటి చేయి ఉంటే ఏమైనా సాధించవచ్చు చిరునవ్వుతో.
      ఒక మధురగీతాన్ని గుర్తుకు తెచ్చావు .... చక్కని స్నేహ ప్రోత్సాహక అభినందన స్పందన
      ధన్యాభివాదాలు శ్రీదేవీ!

      Delete
  2. మాటని పంచుకొని, కష్టాన్ని వినే వారుంటే ఇంకేమీ అక్క్కరలేదు,
    రక్తసంబంధాలను ఎందుకు వెతుక్కుంటారో తెలుసా సర్, మిగతా బంధాలనూ, పరిచయాలనూ నమ్మలేని స్థితిలో ఉంది సమాజం.

    ReplyDelete
    Replies
    1. మాటని పంచుకొని,
      కష్టాన్ని వినే వారుంటే ఇంకేమీ అక్క్కరలేదు,
      రక్తసంబంధాలను ఎందుకు వెతుక్కుంటారో తెలుసా సర్,
      మిగతా బంధాలనూ, పరిచయాలనూ నమ్మలేని స్థితిలో .... సమాజం ఉండటం వల్లే.
      నిజమే అని అనిపిస్తుంది నాకు కూడా నమ్మకము తన మన అనే భావన తోడు చేయూత జీవితం లో చాలా ముఖ్యం ఎందుకయ్యాయో చక్కగా మీ స్పందనలో రాసారు
      నమస్సులు ఫాతిమా గారు!

      Delete