Thursday, March 6, 2014

ప్రేమించబడాలని .... ఈ రోజు నేను





చాలా కష్టంగా ఉంది.
నన్ను నేను ప్రేమించడం .... ఈ రోజు
అమూల్యమైనదేదో కోల్పోయాననే బాధ
ఎవరినుంచైనా ఏదో పొందాలని ....
ప్రేమనే పొందాలని!
ప్రేమ రాగం
ప్రేమ భావం
ప్రేమ లోని స్వచ్చత
పరిపూర్ణతలను కోల్పొయిన కసి పెరిగి
ప్రేమ అనేది
శ్వాసించాల్సినంత అవసరం లా ....
నేడు
నా మానసిక స్థితి దిగజారి
నాలో .... నిరాశక్తత ప్రబలి
అపనమ్మకం పొగమంచులోంచి
లేశమాత్రపు అనుభూతిని కూడా పొందలేక
చిన్నబోయిన నిట్టూర్పు ముఖంలో
చిరునవ్వు పరామర్శను పూయించలేక
మానసికంగా నలిగిపోతూ ఉన్నాను.
ప్రయత్నలోపం లేదు
ప్రతి ప్రయత్నమూ ఎంతో కృత్రిమంగా ఉంది.



చాలా కష్టంగా ఉంది .... ప్రేమించగలగడం
చాలా కష్టంగా ఉంది .... నా ఈ స్థితి
ఈ రూపం లో నేను,
ఒక ఒంటరి అస్తిత్వాన్ని
ఒక ఒంటరి కృంగిపోయిన మానసిక స్థితిని
అంతరంగంలో పల్లవించి పరిమళించాల్సిన
వడలిన పుష్పం అందాన్ని
ఊపిరి కోల్పోతున్న ప్రేమను
ప్రేమించగలరేమో .... ఎవరైనా అని
ప్రేమించబడాలని .... ఈ రోజు నేను

3 comments:

  1. నిజంగా, ప్రేమను పొందలేకపోవడం ఒక దయనీయమైన స్థితి,
    ప్రేమను పంచలేకపోవడం ఒక దురదృష్టమైన స్థితి,
    చంద్రగారు మీ వివరణ బాగుంది.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. నిజంగా, ప్రేమను పొందలేకపోవడం ఒక దయనీయమైన స్థితి,
      ప్రేమను పంచలేకపోవడం ఒక దురదృష్టమైన స్థితి,
      చంద్రగారు మీ వివరణ బాగుంది.
      పరిశీలనాత్మక స్పందన స్నేహాభినందన
      ధన్యాభివాదాలు శ్రీదేవీ! శుభోదయం!!

      Delete