Thursday, March 27, 2014

ఆమె నా మనో సామ్రాజ్ఞి




ఇన్నినాళ్ళ నుంచి అని చెప్పలేను.
ఎన్ని యేళ్ళుగానో
నేను ఈ ఆలోచనల కుటీరం లో .... ఆమె కోసమే
బస చేస్తూ ఉన్నది.

ఆమె కోసమే ఈ మాటలు,
ఈ బాష, ఈ పలకటం నేర్చుకున్నది.
నా శరీరాన్ని, నన్ను బలోపేతం చేసుకున్నది.
ఆమె ఇష్టపడుతుందనే నాకుగా నేను బరువు పెరిగింది.

నా జీవితం లో నేను ఎదురుచూసింది
కోరుకున్నది.
ఎదురుచూసి పొందిందీ
సంద్యా సమయంలోనో
సూర్యోదయ వేళల్లోనో
ఆకస్మికంగా నో
అలవోకగా నో .... ఎప్పుడైనా
కనుసన్నల్లోంచి ఆమె నన్ను చూస్తుండటాన్నే  




ఎన్ని యేళ్ళు గడిచినా
ఎందుకో తెలియదు .... ఇంకా
ఈ గుండె కొట్టుకోవడం మానలేదు.
ఆమెను చూసి తీవ్రంగా .... పక్కటెముకలు అదిరేలా

ఒక్క రాత్తిరిని కూడా నేనెరుగను
ఆమె అనుగ్రహము ఆమె అనుమోదము పొందని
ఆమె తోడులేని నిద్దుర కలల లోకి ....
నేను జారడం

మేలుకొనే వేళల్లో నా కనురెప్పలకు
తెల్లవారినట్లు తెలియదు.
వేడి వేడి నిద్దుర కాఫీ పరిమళాలతో
ఆమె గోరువెచ్చని స్పర్శ, పరామర్శ .... నన్ను తట్టేవరకూ



6 comments:

  1. Replies
    1. వెరీ నైస్
      బాగుంది స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు రాధిక గారు!

      Delete
  2. మీ మనో సామ్రాజ్ఞి చాలా అద్భుతంగా ఉంది

    ReplyDelete
    Replies
    1. మీ మనో సామ్రాజ్ఞి చాలా అద్భుతంగా ఉంది.
      అద్భుతాభినందన స్నేహ ప్రోత్సాహక స్పందన
      ధన్యాభివాదాలు హిమజ ప్రసాద్ గారు!

      Delete
  3. అంతరంగ తరంగాలను సముద్రమంతటి గుండెబైట ఆరబోస్తేనే కదా,
    ఆమె నడిచివచ్చిన పాదముద్రలు మీరు చూడగలరు,
    చక్కటి భావుకత,బాగుంది సర్.

    ReplyDelete
    Replies

    1. అంతరంగ తరంగాలను సముద్రమంతటి గుండె బైట ఆరబోస్తేనే కదా,
      ఆమె నడిచి వచ్చిన పాదముద్రలు మీరు చూడగలరు,
      చక్కటి భావుకత, బాగుంది సర్.
      భావుకతతో కూడిన స్నేహ ప్రోత్సాహక అభినందన స్పందన
      నమస్సులు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete