Wednesday, March 19, 2014

స్మృతి లో కాదు .... తోడుగా ఉంటావని




 
















ఉన్నచోటనే ఉన్న పళాన
అచేతనం గా అసహనంగా
అతని పదాలు
గత కొన్ని రోజులు నెలలు గా
అతన్నలక్ష్యం చేస్తున్నాయి.
అవి అతని భావనలు కావు.
అతని ఆత్మ శకలాలు
హెచ్చరికలులా అతన్నీ
అతని నోటినీ కట్టివేస్తూ ఉన్నాయి.
 
మరణించకుండానే
అంత్యక్రియలు జరిగినట్లు
ఆకలితో అలమటిస్తూ .... కళ్ళు
చూడలేని,
అర్ధం కాని కుళ్ళు
పాచిన ఆహారం .... తినలేక తిని
ఆత్మ దహించుకుపోయి
గుండెను పిండినా
రాని కన్నీళ్ళు లా ఆ మనోగతం
 
వేచి చూస్తున్న అస్థిత్వం
నిన్నొక తోడనుకుంటుంది.
తీవ్ర అంతర్మదనం
సంఘర్షణ జరిగాకే ....
అతని లో, అంతరంగం లో
కాల్పనిక ఊహాసర్పాలు మేల్కొని
ఒకదాన్నొకటి పెనవేసుకుపోయి
గోరువెచ్చని బంధం
ప్రేమ భావనేదో
నరాలను పెనవేసుకుపోతూ ఉంది
 
రాతిరి వేళల్లో
ఆరుబయట మడతమంచం పై
పడుకునున్నప్పుడు
ఆ చంద్రుడి చిహ్నం ....
ఒదిలి వెళ్ళలేని ఒంటరితనం 
చిరు వెచ్చని స్నేహ భావన
అల్లుకుపోయి ఆ శరీరము, ఆ మనసు
ఈ విశ్వం .... అంతా శూన్యమయమై
కేవలం "సహనం" అనే
పదం మాత్రమే మిగిలి ఉన్నట్లు

రక్తసిక్తమై ప్రతి రోజూ అతను 
సందేహం, భయాలను ప్రక్షాళించుకుంటూ
నీవు పంచిన పొదుపు పదాలు
గుర్తుకొచ్చిన క్షణాలలో
నిన్ను మళ్ళీ కోరుకొమ్మనే పిలుపు
ఆశ అనే కొక్కానికి తగులుకుని
నీవూ అతనూ తొలిసారిగా
ఒకరి బాధలో ఒకరు నిండా మునిగిన
క్షణాల ఆ ప్రేమ ఆ నమ్మకం
గుర్తు తెచ్చుకుంటూ



 
అక్షీకరించమని అడుగుతున్నాడు.
అతనితో నీ బంధాన్ని
మళ్ళీ మళ్ళీ తిరగరాయమని
అతని నమ్మకాన్ని
ఎవ్వరూ చూడని ప్రదేశాల్లో
ప్రయణించి ప్రమాణించినట్లు
నీవు రాయగలవని
న్యాయం చెయ్యగలవని
అతనికి తెలుసు
నీకూ రాయాలని ఉందని .... మీ జీవితాల్ని

నీకు జీవితం ఆరాటం, పోరాటం తెలుసు
నిన్నిపుడు ప్రాదేయపడుతున్నాడు
కళ్ళు మూసుకుని
అతని నిశ్శబ్దాన్ని పీల్చి చూడు.
మాటలు పదాలు దొర్లని ఆ సమయాన్ని
నీ ప్రతి శ్వాస లోనూ
ప్రాణం అతనవ్వాలనుకుంటున్న ఆశను
అతని జ్ఞాపకాల్లో కాక అతని జీవితం లో
తోడుగా నిన్నే కోరుకుంటున్న నిజాన్ని

2 comments:

  1. జారిపోయిన క్షణాలను మాల అల్లుకున్నా,
    ఆరిపోయిన ఆశలను మదిలో తలచుకున్నా,
    నడిచిన పాదముద్రల్లో జతను వెతుక్కున్నా,
    ఒక్కసారి,ఒకేఒక్కసారి గతించిన కాలానికి ప్రాణం పోయగలరా..?లేదు కదా, తిరిగి చేరదీసినా అది మారు మనస్సే అవుతుంది కానీ తొలి తీపిదనం రాదు.
    ఒక్కసారి మనస్సులో ఉన్న స్థానాన్ని పోగొట్టుకుంటే తిరిగి పొందటం అసాద్యం (ఇది నా అభిప్రాయమే సర్,)

    ReplyDelete
    Replies
    1. జారిపోయిన క్షణాల మాలను అల్లుకుని, ఆరిన ఆశలను మదిలో తలచుకుని, నడిచిన పాదముద్రల్లో జతను వెతుక్కుంటున్నా .... ఒక్కసారి, ఒకే ఒక్కసారి గతించిన కాలానికి ప్రాణం పోయగలరా..?లేదు కదా, తిరిగి చేరదీసినా అది మారు మనస్సే అవుతుంది కానీ తొలి తీపిదనం రాదు. ఒక్కసారి మనస్సులో ఉన్న స్థానాన్ని పోగొట్టుకుంటే తిరిగి పొందటం అసాద్యం (ఇది నా అభిప్రాయమే సర్,)
      మానవ ఆలోచనల అస్తిత్వాల ఆవిష్కరణ స్పందనగా బాగుంది మనో విశ్లేషణ
      ధన్యవాదాలు ఫాతిమా గారు! శుభోదయం!!

      Delete