చిత్రంగా లేదూ!
ఖచ్చితంగా తెలియదు.
పోలికేలేని
నా ప్రేమను,
నీ ప్రేమను ....
భిన్నంగా
ఎలా వివరించాలో
ఒక విధంగా చూస్తే
నీవు,
నా సిరలు,
దమనుల్లో ప్రవహించే
రక్తం
పరిశుభ్రం చేసే
ప్రాణవాయువువి అనిపిస్తావు.
నేనేమో,
తారు రోడ్డుమీద ....
నా దేవత చిత్రం గీసి
వర్షం కురిసి
అది కరిగి మర్చిపోవాల్సిన
ముద్ద సుద్ద నులా అనిపిస్తాను.
No comments:
Post a Comment