Thursday, March 13, 2014

మాయగాళ్ళున్నారు జాగ్రత్త!



అతని లోని రాక్షసత్వం .... స్వార్ధ
ఆలోచనల చీకటి పొగమంచు .....
జరిగిన సంఘటనను మర్చిపోవాలనే
ప్రయత్నం ....
మళ్ళీ వస్తానని ఆమే చెప్పిన వీడ్కోలులో
ఏదో అమానవీయానందం .... అతనిలో
ఆమె నుంచి అన్నీ దోచుకుని
ఆమె శరీరాన్ని,
ఆమె అమాయకత్వాన్నీ
ఆమె కలల్నీ
మోసపు మాటల ముసుగులో
ఆమెను .... గాయపరిచి,
ఆత్మను బాధించి
ఆ వేళ్ళ సున్నిత స్పర్శలో
అమాయకత్వాన్ని బహుమానం గా పొంది
అహంకారం తో దూరంగా విసిరేసి ....


ఎంతో దుర్మార్గంగా,
ఎంతో కిరాతకంగా,
అతని ప్రవర్తన చేసిన గాయాల గుర్తులు మాత్రం
కోల్పోయిన ఆమె అమాయకత్వానికి
ఆమె నిర్దోషిత్వానికి నిదర్శనాలై.
వెళ్ళిపోబోతూ ఆమె సిగ్గుపడింది.
నవ్వుకుంది తనలో తాను.
అప్పుడు
ఆమె నవ్వులో ఎంత అమాయకత్వము!
ఎంత నిర్మలత్వము!
వెళ్ళబోతూ చేరవచ్చి
అతన్ని బుగ్గలపై ముద్దాడింది .... ఒక్కసారి



అతని లోని మృగాన్ని క్షమించేసి,
అమాయకం గా
తన ఊహల్లోని రాజకుమారుడినే
అతనిలో చూస్తూ, ఆమె వెళ్ళిపోయింది.
అతను మాయమైపోతాడని తెలియక

8 comments:

  1. chaala baagunai alochipa chestnai

    ReplyDelete
    Replies
    1. చాలా బాగున్నాయి అలోచింప చేస్తున్నాయి .... స్పందన
      చాలా బాగుంది స్నేహ ప్రోత్సాహక అభినందన
      ధన్యవాదాలు కలిగొట్ల వెంకట రత్న శర్మ గారు! శుభోదయం!!

      Delete
  2. ఎన్ని చూసినా,ఎంత చెప్పినా,మా ప్రేమ అలాంటిది కాదు,అతను అలాంటివాడు కాదు......అనే భ్రమ వీడనంత కాలం మాయగాళ్ళు వుంటూనే ఉంటారు.

    ReplyDelete
    Replies
    1. ఎన్ని చూసినా, ఎంత చెప్పినా,
      మా ప్రేమ అలాంటిది కాదు, అతను చాలా మంచివాడు అందరి లాంటివాడు కాదు ......
      అనే భ్రమ వీడనంత కాలం
      మాయగాళ్ళు వుంటూనే ఉంటారు. మాయలు చేస్తూనే ఉంటారు .... స్పందన
      స్పందన లో నిష్కర్ష నిజాయితీ తో కూడిన ప్రోత్సాహక భావన
      హన్యవాదాలు శ్రీదేవీ! శుభ ఉషోదయం!!

      Delete
  3. Replies
    1. జాగ్రత్తగా ఉండమని అలర్టింగ్ వర్డ్స్ .... స్పందన
      ఏకీభావన
      ధన్యాభివాదాలు పద్మార్పిత గారు! శుభారుణోదయం!!

      Delete
  4. ఈ అమాయకత్వమే,ఈ వెర్రితనమే. అజాగ్రత్తకు మూలం.

    ReplyDelete
    Replies
    1. ఈ అమాయకత్వమే,
      ఈ వెర్రితనమే.
      అజాగ్రత్తకు మాయమనోభావనలకు మూలం.
      సూక్ష్మ పరిశీలనాత్మక స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
      నమస్సులు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete