నిన్న అన్నది నేనే
అది
ఒక విషయం అదృష్టం అని
అది
ఎప్పుడూ వచ్చి వెళుతూ ఉంటుంది అని.
...............
అది, ఒక నిజం,
ఒక నాణ్యత,
ఒక స్వచ్చత,
ఒక పరిపుర్ణత,
ఒక అవసరం ....
పొందేవరకూ అని.
.............
అది,
ఒక చిక్కని
ఆలోచన అని,
మరొకసారి
ఆలోచించాలనిపించని
భావన అని.
.............
కానీ
ఇప్పుడు అనిపిస్తుంది.
ఆ వచ్చి వెళ్ళే కల,
ఆ అదృష్టం,
ఆ స్వచ్చ పరిపూర్ణత్వ ఆలోచనల
సమిష్టి రూపం .... నీవేనేమో అని.
మొత్తానికి ఒక క్లారిటి వచ్చింది,బాగుంది చంద్రగారు.
ReplyDeleteమొత్తానికి ఒక క్లారిటి వచ్చింది,
Deleteబాగుంది చంద్రగారు.
బాగుంది స్నేహ ప్రోత్సాహక స్పందన
ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!