Wednesday, March 5, 2014

మాతృమూర్తి




కడుపులో దాచుకుని భద్రం గా
తొమ్మిది మాసాలు .... ఓ మాతృమూర్తి
కన్నావు నన్ను
..............
భూమ్మీద పడ్డాక కూడా
నా బ్రతుకును నేను నేనుగా బ్రతకగలిగేలా
అవసరమైన సమయస్పూర్తిని, విజ్ఞతను,
ధైర్యాన్ని నా రక్తనాళాల్లో నింపి
.............
అక్కడ,
ఆ ప్రభుత్వ ఆసుపత్రి లో
ఒక జీవితాన్ని ఆవిష్కరించావు

నీ ప్రేమను ఉగ్గుపాలు గా చేసి
ఎంతో శ్రద్ధగా, మురిపెం గా
నన్నో ధైర్యవంతుడ్నిలా దిద్దావు.
..........................
నా అవసరాలు, నా ఆలోచనలు
నన్ను పక్కదోవ పట్టించకుండా
దిశా నిర్దేశం చేసావు
....................
ఒక పరిపూర్ణ మాతృముర్తి లా
శ్రమ, సహనం, స్వేదం, నమ్మకానివై
నా ఎదుగుదలలో అమూల్యం .... నీ పాత్ర
...................
అప్పుడప్పుడూ నీలో బాధను గమనిస్తున్నాను..
నీ పెంపకం లో లోపం ఉందేమో అని
నీలో నీవు అనుకోవడమూ విన్నాను.
...................
లోపరహిత జీవనం సాధ్యమా అమ్మ
ఈ ప్రపంచం లో ..... పరిపూర్ణత అనేదే లేదు.
ఆ దిశగా నడుస్తున్నాను. అదే చాలు!.




అమ్మా! నీకోసమే ఈ కవిత రాసుకుంటున్నాను. .
నీకు తెలియాలని కాదు..
నా మనసు మాటలివి.
................
నీ ప్రేమ లో పుత్ర మోహాన్ని మించిన
దేవతాతత్వాన్ని చూసానని,
నీ ప్రతి చర్యలో అంకితభావనను గమనించానని,
................
నీకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా
చూడాల్సిన బాధ్యతే ఒక వరం అని,
మనసు మాటకు అక్షర రూపం ఇస్తున్నా! అంతే!
.................
నీ అనురాగం, నీ మమకారం నీ రూపం
నీవు కాదా కారణం? .... అమ్మా!
ప్రతి స్త్రీలోనూ ..... పవిత్రతను, తాపసి నే చూడగలగడానికి ....
నీ ఆశిస్సులు శ్వాసగా .....!!

4 comments:

  1. ప్రతి స్త్రీలోనూ అమ్మని చూడగల మీ సంస్కారానికి నా సలాం.

    ReplyDelete
    Replies
    1. ప్రతి స్త్రీలోనూ అమ్మని చూడగల మీ సంస్కారానికి నా సలాం.
      ప్రతి స్త్రీ ఒక ప్రకృతి రూపం అని నమ్ముతాను .... ఒక మంచి అభినందన మీ స్పందన
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!

      Delete
  2. ప్రతి స్త్రీలోనూ అమ్మని చూడగలిగే సంస్కారం సమాజంలో నిండితే అబ్బ,ఆ ఊహకే మనసు ఎంత సతోషంగా ఉంది.చంద్రగారు చాలా బాగుంది మీ మాతృమూర్తి.

    ReplyDelete
    Replies
    1. ప్రతి స్త్రీలోనూ అమ్మని చూడగలిగే సంస్కారం సమాజంలో నిండితే అబ్బ .... ఆ ఊహకే మనసు ఎంత సంతోషంగా ఉంది.
      చంద్రగారు చాలా బాగుంది మీ మాతృమూర్తి.
      మనసెరిగి ఆశీర్వదించే బ్రహ్మ అమ్మ
      ధన్యాభివాదాలు శ్రీదేవీ! సుప్రభాతం!!

      Delete