వెలుతురు లేదు.
ఎటు వెళ్ళాలో తెలియదు
పక్కన నడిచేందుకు తోడెవరూ లేరు .... అని
నీకు అనిపించినప్పుడు ....
నీ వద్దకు వస్తాను.
ఓ పిల్లా! నేనే నీవద్దకు వస్తాను.
చీకట్లు చిక్కగా ముసిరి
పెనుతుఫాను ప్రబలిన క్షణాల్లో .....
నీవు నా కోసం రానక్కర్లేదు. నేనే వస్తాను.
ఓ పిల్లా! నేనే వస్తాను.
అప్పుడప్పుడూ
కలలు ఎండిపోయి నిద్దురలేమి
దరిదాపుల్లో మంచిరోజులు కానరాక
ఎలా బయటపడాలో
ఏమి చెయ్యాలో తెలియక .... అయోమయం లో
నిన్ను నీవు కోల్పోతావేమో ....
అప్పుడు కూడా భయపడకు.
కన్నీళ్ళెన్ని కురిసినా చలించకు!
నీ ఆత్మ పిలుపు నాకు వినపడుతుంది.
ఒట్టేసి చెబుతున్నా!
ప్రళయమే వచ్చినా
నేనక్కడ నీపక్కనుంటాను .... అప్పుడు.
ఒకవేళ
మనం ఒకరికొకరమై
సహజీవనం సాగించే అవకాశం లేకపోయినా
స్నేహితులుగా అయినా ఉందాము .... ఎప్పటికీ,
అందుకని నా ప్రమాణాన్ని నమ్ము!
మళ్ళీ చెబుతున్నా ....
మూడో ప్రపంచ యుద్ధమే జరిగినా
అన్నీ పరిత్యజించి
నీ వద్దకు వస్తాను.
ఓ పిల్లా!
నేనే నీవద్దకు వస్తాను
నీ తోడుగా ఉండేందుకు
తెలియాల్సింది
ఏ సమయం లో ఏ సహాయాన్ని
ఎవరినుంచి ఆశించొచ్చో అడగొచ్చో అనే,
ఎవరు నీ సమశ్యను అర్ధం చేసుకోగలరో అనే,
ఒకవేళ నీకుగానీ
నీ ఆత్మ బలహీనపడిపోతుందనిపించి
ఒక నమ్మకం, ఆస్వాసన అవసరం అయి
నేను కాక మరి ఎవరూ నీ జీవితం లో లేకపోతే
నేనే వస్తాను .... సంబ్రమముగా
ఓ పిల్లా! నీ చెయ్యందుకునేందుకు,
పాపం ! ఇవన్నీ ఆ సదరు వ్యక్తి ఆ పిల్లకు తెలియజేశాడా?లేక తనలో తనే చెప్పుకుంటున్నాడా?ఆ పిల్లకి తెలిస్తే మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయదు చంద్రగారు.
ReplyDeleteపాపం ! ఇవన్నీ ఆ సదరు వ్యక్తి ఆ పిల్లకు తెలియజేశాడా?
Deleteలేక
తనలో తనే చెప్పుకుంటున్నాడా?
ఆ పిల్లకి తెలిస్తే మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయదు చంద్రగారు.
పురుషుడు ప్రకృతిని పరిరక్షించే ఆలోచన కార్య రూపం లో చూడలనుకుంటున్న భావన స్పందన
ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!
నీకు కావల్సింది,
ReplyDeleteతెలియాల్సింది
ఏ సమయం లో ఏ సహాయాన్ని
ఎవరినుంచి ఆశించొచ్చో అడగొచ్చో అనే....నిజమేకదా :-)
నీకు కావల్సింది, తెలియాల్సింది
Deleteఏ సమయం లో ఏ సహాయాన్ని
ఎవరినుంచి ఆశించొచ్చో అడగొచ్చో అనే....
నిజమేకదా :-)
ఏకీభావన స్పందన
బాగుంది ప్రోత్సాహక అభినందన
ధన్యాభివాదాలు పద్మార్పిత గారు! శుభారుణోదయం!!
అనుమతి కొసం ఆగటంలోనే తెలుస్తుంది. అడుగు ముందుకేయలేని బుద్దూ.... అని.
ReplyDeleteపిల్ల తెలివైనదైతే ఇట్టే కనిపెట్టేస్తుంది ఈ సిగ్గరి మహా మొహమాటస్తుడని.
(బాగుంది సర్, కవితలో తెలీని సున్నిత మానసిక సంఘర్షణ కనిపిస్తుంది, పదాల పొందిక బాగుంది)
అనుమతి కొసం ఆగటంలోనే తెలుస్తుంది. అడుగు ముందుకేయలేని బుద్దూ.... అని. పిల్ల తెలివైనదైతే ఇట్టే కనిపెట్టేస్తుంది ఈ సిగ్గరి మహా మొహమాటస్తుడని.
Delete(బాగుంది సర్, కవితలో తెలీని సున్నిత మానసిక సంఘర్షణ కనిపిస్తుంది, పదాల పొందిక బాగుంది)
నిజమే మెరాజ్ గారు .... కొందరు పుట్టుకతోనే అతి మొహమాటస్తులు
బాగుంది స్నేహాభినందన స్పందన
నమస్సులు ఫాతిమా గారు! సుప్రభాతం!!