Wednesday, March 19, 2014

విషాద గీతం



 











నీకు ముందే తెలుసా?
దిగజారి
నేను క్రిందకు పడిపోతానని
నా తెగింపు
నా తొందరపాటు
పరిణామం ఇదే అని
ఇలాగే జరుగుతుందని
.............
ఏడ్చిన కళ్ళు
మూసుకుపోయిన ముందుచూపు
నేల మీద ప్రాకుతూ
ఆ అరుపులు
ఆ వేడుకోవడాలు
మరణానికి ముందు
హృదయాలు గొల్లున ఏడుస్తున్న
ఆ ద్వనులు
.............
బలవంతపు కారణాల
భారమేదో మీదపడి
అస్తిత్వం నలిగి చూర్ణం అయినట్లు
అది నొప్పి లా కాక
అంతకు ముందు .... ఎప్పుడో
క్రింద పడినప్పటి బాధ తాలూకు
మచ్చ అని మరిచిపోను.

3 comments:

  1. నైస్
    బాగుంది స్పందన అభినందన
    ధన్యవాదాలు కార్తీక్ గారు! శుభోదయం!!

    ReplyDelete
  2. బలవంతపు కారణాల భారమేదో మీద పడినట్లు" చక్కటి పదాల పొందిక.

    ReplyDelete
    Replies
    1. "బలవంతపు కారణాల భారమేదో మీద పడినట్లు"
      చక్కటి పదాల పొందిక.
      బాగుంది అభినందన స్నేహ ప్రోత్సాహక స్పందన
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete