ఎక్కడో ఉన్నాను. కానీ
ఇక్కడ నీ శ్వాస ద్వారా నిశ్శబ్దంగా
నీలోకి ప్రవహిస్తూ .... నీలోనే ఉన్న అనుభూతి.
ఔనూ! నీకూ అనిపిస్తుందా?
నేను నీలోనే ఉన్నానని
నీలోనే ఉండి నిన్ను స్పర్శిస్తున్నానని
నా స్పర్శ వెచ్చదనం
నా చిరునవ్వు చల్లదనం
నీ అనుభూతికి వస్తున్నాయా!?
నాకు మాత్రం ....
నీవు నన్ను నిశ్వసిస్తున్నట్లుంది.
నీలో పెనుతుఫాను
అలల అల్లకల్లోలతలు సర్దుమణిగించేందుకు
నేను కృషి చేస్తున్నట్లుంది.
నేను నిన్ను అనుభూతిచెందుతున్నట్లు
నీవు నన్ను స్పర్శిస్తున్నట్లు
నేను నీకు అతి సమీపంగా ఉండి
నీ ప్రేమ ను పొందుతున్నట్లుంటుంది.
నా బాధ
నాలోని అనిచ్చితి, నాలోని ఆవేశం
శాంతిమయం, నిర్మలం అవుతూ
మమైకమై మనం
ఎక్కడెక్కడ్నుంచో వచ్చి ఒక్కటైనట్లుందిక్కడ
No comments:
Post a Comment