Sunday, March 16, 2014

ప్రేమ కోసం




అతనిలో అతను కాలిపోతున్నాడు
ఆ పిల్ల ప్రేమ కోసం
నిరాశపరిచిందని, కాదన్నదని .
హృదయం తో ఆటలాడుకుందని
కనికరమైనా లేని స్త్రీ .... ఆమె అని
అంత అందమైన చిరునవ్వు తో
ఒక హృదయాన్నీ
ఒక ప్రపంచాన్ని ఎలా ముక్కలు చేసిందని,
అతను మంటల్లో కాలిపోతున్నాడు.
విరహం సెగలు చెలరేగి 
కాలిపోతూ ....
వసంతించదని తెలిసిన ప్రతి రాత్రీ
అతను మండిపోతున్నాడు .... మండిపోక తప్పక
అదిగో పొగ,
అదే సెగ ....
అతని జీవితం మంటల్లో కాలిపోతూ ....

ఆమె ఎలా ఉండగలుగుతుందో!? 
కాసింతైనా మానవత్వం,
సిగ్గు అనిపించక ....
అంత అవివేకం గా ....
మంటల్లో అతను దహించబడటం చూస్తూ
మరిచిపోయుంటుందా!
ఆమె తనిచ్చిన మాట 
అతన్నొదిలెళ్ళనని
అతనికి దూరంగా ఉండలేనని .... చేసిన బాస
అంతా మోసం, అబద్దం
అబద్దాలకోరు ఆమె అయినట్లు .... 
అతని గుండెను పగులగొట్టి
ఎందుకిలా జరుగుతుందో .... అనిపిస్తూ!?




అతను కాలిపోతున్నాడు.
లోలోన అంతరంగం లో
మంటలు చెలరేగుతున్నాయి.
అగ్నికీలలు చుట్టుముడుతూ
అతను కాలిపోతున్నాడు.
ఆమె ప్రేమ కోసం మంటల్లో ....
ఆవిర్లు విరహం సెగలు
అతని గుండెను కాల్చేస్తున్నాయి.
విరహ వేదనను ఆమె తన మనసుతో చూడాలని ....
అతను తనలో తాను కాలిపోతున్నాడు.
ఆమె ప్రేమ కోసం ....
తన మనోభీష్టం నెరవేరడం కోసం,

4 comments:

  1. సర్, ప్రేమికుని మానసిక వేదన మీ కలం చాలా బాగా పలుకుతుంది.
    (కుటుంభ మిత్రులు కాకుంటే ఈయన ఓ పెద్ద దేవదాసు అనుకొనేదాన్ని:-)))
    ఇంతకుముందు ఓ సారి అన్నాను, మళ్ళీ అంటున్నాను యువత కు మీ బ్లాగ్ పెద్దబాలశిక్ష అవుతుంది.
    మానసిక శాస్త్రాన్ని(మా సబ్జక్టే అయినా మాకు సరిగా తెలీదు) కాచి వడపోసినట్లుంటుంది మీ భావ వల్లరి.

    ReplyDelete
    Replies
    1. ప్రేమ భావనలను తరచు ప్రస్తావించకుండా ఉండలేని బలహీనత నాది. అప్పుడప్పుడూ నన్ను నేను ప్రశ్నించుకుంటాను .... అవసరమా అని? అయినా వారానికి ఒక్కటైనా రాయకుండా ఉండలేను. జీవనానికి పునాది ప్రేమే అనే నమ్మకాన్ని బలంగా నమ్మడం వల్ల .... భావుకుడిగా నేను నా కోణం నుంచి క్రమం అనుకున్న నడవడికకు అక్షర రూపాన్ని యిచ్చి .... అందులో కొంతైనా ఎవరికైనా స్వాంతననిచ్చి స్వీకరించబడితే .... ఆనందిస్తుంటాను. మీ స్పందన ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది.
      ధన్యాభివాదాలు మెరాజ్ గారు! సుప్రభాతం!!

      Delete
  2. అన్యదా బావించకండి.నేను కొంచం చనువుగా కామెంట్ పెట్టినందుకు.
    మీ పై ఉన్న గౌరవమూ,అభిమానమూ ఉన్నందువల్లా, కొంచం సరదాగా స్పందించాను సర్.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందన ఎంతో హుందా గా ఉంది
      మీలాంటి వారి పరామర్శలు భావుకత్వ నాణ్యతను పెంచుతాయి
      మీరు నొచ్చుకోవాల్సిన అంత అవసరం లేదు. మీ స్పందన చదివి నేనెంతో గర్వంగా గౌరవంగా ఫీల్ అవుతున్నాను.
      _/\_లు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete