అప్పుడప్పుడూ
ఎంతో సుతారంగా, సున్నితంగా
నిన్ను దగ్గరకు తీసుకుంటాను.
ముద్దాడాలనిపించి,
నీవు సిగ్గుపడతావు.
ఊపిరాడని కొన్ని సందర్భాల్లో
నీవు ఉక్కిరిబిక్కిరై బాధపడి
భయానక భావనల చీకటి
పూర్తిగా నీలోకి వ్యాపించి
నిన్ను చుట్టుముట్టినప్పుడు
నీవు,
బాధను దరించిన వన్య స్త్రీ లా
దిగులుకూడును తింటున్నట్లు ఉంటావు.
అలాంటప్పుడు ఎప్పుడైనా
ముద్దాడినా, దగ్గరకు తీసుకున్నా
చెమట ఉప్పదనమో
రక్తం జిగురుదనమో రుచి అయ్యి
నీ ముఖాన్ని సున్నితంగా
నా అరచేతుల్తో పొదువుకుని తడిమి
నీలోని విచారాన్ని పారద్రోలాలనిపిస్తుంటే
నా అనుబంధాన్ని ఏమంటారో .... మరి?
భయానక భావనల చీకటి
ReplyDeleteపూర్తిగా నీలోకి వ్యాపించి
నిన్ను చుట్టుముట్టినప్పుడు
నీవు,
బాధను దరించిన వన్య స్త్రీ లా
దిగులుకూడును తింటున్నట్లు ఉంటావు...
ఎంత లోతట్టుభావమండి.
భయానక భావనల చీకటి పూర్తిగా నీలోకి వ్యాపించి
Deleteనిన్ను చుట్టుముట్టినప్పుడు
నీవు,
బాధను దరించిన వన్య స్త్రీ లా
దిగులుకూడును తింటున్నట్లు ఉంటావు...
ఎంత లోతట్టుభావమండి.
చక్కని ప్రశంస, బాగుంది స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
ధన్యాభివాదాలు పద్మార్పిత గారు! సుప్రభాతం!!
ReplyDelete"బాధను దరించిన వన్య స్త్రీ లా
దిగులుకూడును తింటున్నట్లు ఉంటావు.
అలాంటప్పుడు ఎప్పుడైనా
ముద్దాడినా, దగ్గరకు తీసుకున్నా
చెమట ఉప్పదనమో
రక్తం జిగురుదనమో రుచి అయ్యి
నీ ముఖాన్ని సున్నితంగా
నా అరచేతుల్తో పొదువుకుని తడిమి
నీలోని విచారాన్ని పారద్రోలాలనిపిస్తుంటే
నా అనుబంధాన్ని ఏమంటారో .... మరి?"
ఏమిటీ భావనల ధార.
ఎంతటి పరిజ్ఞానాన్ని దాచుకున్నారు మీలో .
అబ్బుర పరిచారు కదా !
అందుకోండి నా హార్దిక అభినందనలు.
*శ్రీపాద
"బాధను దరించిన వన్య స్త్రీ లా దిగులుకూడును తింటున్నట్లు ఉంటావు.
Deleteఅలాంటప్పుడు ఎప్పుడైనా, ముద్దాడినా, దగ్గరకు తీసుకున్నా
చెమట ఉప్పదనమో .... రక్తం జిగురుదనమో రుచి అయ్యి
నీ ముఖాన్ని సున్నితంగా నా అరచేతుల్తో పొదువుకుని తడిమి, నీలోని విచారాన్ని పారద్రోలాలనిపిస్తుంటే నా అనుబంధాన్ని ఏమంటారో .... మరి?"
ఏమిటీ భావనల ధార.
ఎంతటి పరిజ్ఞానాన్ని దాచుకున్నారు మీలో ..... అబ్బుర పరిచారు కదా !
అందుకోండి నా హార్దిక అభినందనలు.
*శ్రీపాద
శ్రీపాద గారు భావనను ఆవిష్కరించగలగడానికి భావుకుడికి లో బాధ ఆవేదన అనుభూతి ఆవేశం .... చాలు. అదే భావనను అంత రక్తిగా అనుభూతిచెందడం చాలా గొప్ప విషయం! మీలో ఆ ఔన్నత్యాన్ని చూస్తున్నాను.
హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీపాద గారు! సుప్రభాతం!!