సముద్రుడి ఆశయం నెరవేరి
ఆకాశం ను అందుకున్న
అనుభూతి లాంటి లక్షణం
సరిహద్దుల్లో
ఊపిరి బిగబట్టించే అస్పష్ట క్షణం
పాటశాల రోజుల్లొకి
బాల్యావస్థలోకి జరుగుతూ
శిదిలావస్థ లో ఉండీ, సాహసించమని
దోబూచులాడుతూ పురికొల్పే
క్షణాల జ్ఞాపకం
వయసు మీదపడుతూ
అనుభవాల గుట్టలు పేర్చుకుని
నూతన ఆశలు, గమ్యాలు, ఆశయాలతో
తెలియని భవిష్యత్తులోకి
చొచ్చుకుపోవాలనిపించే పట్టుదల
ఆ అవకాశం ఆశ
ఊపిరి బిగబట్టించుతూ
ఆకాశాన్ని ముద్దాడాలనే సంకల్పం అంచులో ....
చైతన్యం పల్లవిస్తున్న .... చూపు లక్ష్యం
ఆ సప్త సముద్రాల సరిహద్దుల్లో .....
పట్టుదల, కృషి ఉంటే లక్ష్యం ఎప్పుడూ నెరవేరుతుంది. బాగుందండి ఉత్కంట అనుభవసారం.
ReplyDeleteపట్టుదల,
Deleteకృషి ఉంటే లక్ష్యం ఎప్పుడూ నెరవేరుతుంది.
బాగుందండి ఉత్కంట అనుభవసారం
బాగుంది స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన!
నమస్సులు పద్మార్పిత గారు!