ఇది అబద్దం అయితే ఎంత బాగుణ్ణు
ఒక కవిత రాసేందుకు ఉపక్రమించాను
నీ హృదయానికి హత్తుకుపోయేలా
గాలికి కూడా చోటు దొరకనంత ఘాడంగా
చేరువవ్వాలని
కానీ,
దూరం మరీ విశాలమయ్యింది.
నిజం .... నీ కళ్ళు అంత లోతనుకోలేదు.
స్పర్శించాలనే ఆశ ఆశగానే మిగిలి నిన్ను చేరలేక,
నా లోకి లాక్కోలేక .... అపరిష్కృతం గానే మిగిలిపోయి
"గాలికి కూడా చోటు దొరకనంత"..ఇది అంతరిక్ష శాస్త్రం లో శూన్యం అనేదానికి సమం.సూన్యంలో ఏ రెండు వస్తువులూ దగ్గర కాలేవు.,రాలేవు ..అందుకే దూరం మరీ విశాలంమయ్యింది కవి గారూ..తెలియక రాసినా వొక శాస్త్ర నియమాన్ని అందమైన భావ కవితలో పొందుపరిచారు మీరు.
ReplyDelete"గాలికి కూడా చోటు దొరకనంత"..
Deleteఇది అంతరిక్ష శాస్త్రం లో శూన్యం అనేదానికి సమం.
సూన్యంలో ఏ రెండు వస్తువులూ దగ్గర కాలేవు., రాలేవు .. అందుకే దూరం మరీ విశాలంమయ్యింది కవి గారూ..
తెలియక రాసినా వొక శాస్త్ర నియమాన్ని అందమైన భావ కవితలో పొందుపరిచారు మీరు.
ముందుగా నా బ్లాగుకు మీకు హృదయపూర్వక స్వాగతం! చక్కని విశ్లేషణ మీ అభినందన స్పందన
ధన్యాభివాదాలు astrojoyd గారు! శుభోదయం!!