రాత్తిరివేళ,
తెల్లని పిండారబోసిన ఆ వెన్నెల కాంతి లో
డాబా పై, పడకమంచం మీద నిదురిస్తూ .... అతను.
మూసుకునున్న
అతని కనురెప్పల వైపే తదేకం గా చూస్తూ .... ఆమె
పగలు పడిన కష్టాన్ని మరిచిపోవడం .... అలవాటై
అతని ముఖం లో .... ఆమెకు
ప్రశాంతత, నిర్మలత్వం .... ఏదో అందం
వైశిష్ట్యం కనిపిస్తున్నాయి.
ఆమెకు తెలుసు,
నిద్రలేస్తూ చూస్తూనే ....
తనను ద్వేషవాక్కులతో బాధిస్తాడని.
అయినా,
అతనంటే అపరిమిత ప్రేమ ....
అలా నిద్రపోతూ ఉన్న వేళల్లో
మూసుకునున్న ఆ కనురెప్పల్ని చూస్తూ ఆనందిస్తూ
ఎంతో పవిత్రము, నిర్మలము, మధురము తమ ప్రేమ అనుకుంటూ
కాలం ఎవరి కోసమూ ఆగదని తెలుసు ....
సూర్యోదయం అవుతుందని, అతను నిద్దుర లేస్తాడని తెలుసు
అబద్దాలు చెప్పడానికే జీవిస్తున్నట్లు
ఒక అబద్దపు జీవనారంభం అవుతుందని తెలుసు
కానీ ....
వద్దు, కాదు అనుకోలేదు.
విశ్రమిమించే వేళ ఆమె కళ్ళకు మాత్రమే కనిపిస్తుంది
ఆతని ముఖం లో అమాయకత్వం, నిద్దురలో ఆ ప్రశాంతత
ఏ లాంటి కలలు కంటూ ఉన్నాడో ..... తనతో అనుకునే నమ్మకం
ఉదయం, మేల్కొంటూనే
అతను ఎలాగూ బెదిరిస్తాడు హింసిస్తాడని తెలిసు!
అయినా, నిదురించే వేళలో నిద్దురలో
అతనిది నిర్మలమైన ప్రేమ అని, ఆ ఆశే బంధమైన ప్రాకృతం .... ఆమె
" విశ్రమిమించే వేళ ఆమె కళ్ళకు మాత్రమే కనిపిస్తుంది
ReplyDeleteఆతని ముఖం లో అమాయకత్వం, నిద్దురలో ఆ ప్రశాంతత
ఏ లాంటి కలలు కంటూ ఉన్నాడో ..... తనతో అనుకునే నమ్మకం "
ఎంతటి అవగాహన ఆమెలొ. అందుకే ఆమె " స్త్రీ " అయింది
చాలా బాగా కుదిరింది మీ కవిత చంద్ర గారూ.
అభినందనలు .
*శ్రీపాద.
"విశ్రమిమించే వేళ ఆమె కళ్ళకు మాత్రమే కనిపిస్తుంది
Deleteఆ ముఖం లో అమాయకత్వం, నిద్దురలో ఆ ప్రశాంతత
ఏ లాంటి కలలు కంటూ ఉన్నాడో ..... తనతో అనుకునే నమ్మకం"
ఎంతటి అవగాహన ఆమెలొ. అందుకే ఆమె " స్త్రీ " అయింది.
చాలా బాగా కుదిరింది మీ కవిత చంద్ర గారూ. అభినందనలు .
*శ్రీపాద.
సహనం, క్షమా గుణం జీవన సరళిగా .... మార్పు దిశగా ఆశ మనిషిని నడిపిస్తూ ....
స్పందన చాలా బాగుంది
ధన్యవాదాలు శ్రీపాద గారు! శుభోదయం!!
స్త్రీ హృదయాన్ని ఎంత చక్కగా వివరించారు చంద్రగారు,మహిళలందరి తరుపునా నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
ReplyDelete
Deleteస్త్రీ హృదయాన్ని ఎంతో చక్కగా వివరించారు చంద్ర గారు,
మహిళలందరి తరుపునా నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
బాగుంది స్నేహాభినందన స్పందన
ధన్యవాదాలు శ్రీదేవీ! సుప్రభాతం!!