అక్షరాలు, వర్ణాలు ఎన్నో
నేలమీద పేరుకుని ఉన్నా ....
పట్టించుకోని
మౌనం మాత్రమే నివశిస్తూ
ఎవరూ లేరన్నట్లు ....
ఇక్కడ
ప్రతి ఉదయమూ పాచిముఖం
పడకమంచం ను పలుకరిస్తూ
పడక కాఫీ
కొద్ది సేపట్లో
గూళ్ళు జారే బరువులు
భుజానేసుకుని
పాటశాలకు బార్లు తీరే
పసి పావురాల బై బై లు
గోడమీద గడియారం ముల్లుల్లా ....
యదావిది
కాలాతీతం కాని ఆహారం కోసం
వాకిట్లో కుక్కపిల్ల చేసే ఆర్బాటమూ
ఒక్క ప్రశ్నించడం మాత్రమే తెలియని ....
జగతి లో
జవితం ఒక యంత్రం!
సమాజం ఒక యంత్రాలయం
నిజమే గోడమీది గడియారం ముల్లే మనం.
ReplyDeleteపిల్లల పుస్తకాల బరువు పై మీరు చేసిన పద ప్రయోగం అద్భుతం సర్.
మీ కవితల్లో ఓ కొత్త ఒరవడి కనిపిస్తుంటుంది నాకెప్పుడూ.
నిజమే గోడమీది గడియారం ముల్లల్లేనే మనం.
Deleteపిల్లల పుస్తకాల బరువు పై మీరు చేసిన పద ప్రయోగం అద్భుతం సర్.
మీ కవితల్లో ఓ కొత్త ఒరవడి కనిపిస్తుంటుంది నాకెప్పుడూ.
నిజంగా ఆ కొత్త ఒరవడి శుభసూచకం అయితే బాగుణ్ణని ఆశ
చక్కని స్నేహ ప్రోత్సాహక అభినందన స్పందన
ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!! :)
ఎంతటి భావుకత మీ పలుకుల్లో .
ReplyDeleteచాలా నచ్చింది నాకు. ఉత్కంటను
కలిగిస్తూ చివరి వరకూ ఓ చల్లని వాయు పవనంలా నడిచింది మీ కవిత.
"జవితం ఒక యంత్రం!
సమాజం ఒక యంత్రాలయం"
కవిత లోని సారాంశాన్ని రెండు వఖ్యాల్లో భలేగా చెప్పారు
అభినందనలు చంద్ర గారూ !
*శ్రీపాద
ఎంతటి భావుకత మీ పలుకుల్లో .
Deleteచాలా నచ్చింది నాకు. ఉత్కంటను కలిగిస్తూ చివరి వరకూ ఓ చల్లని వాయు పవనంలా నడిచింది మీ కవిత.
"జవితం ఒక యంత్రం!
సమాజం ఒక యంత్రాలయం"
కవిత లోని సారాంశాన్ని రెండు వాఖ్యాల్లో భలేగా చెప్పారు
అభినందనలు చంద్ర గారూ !
*శ్రీపాద
మీ వాఖ్య ఎంతో చక్కని ఆస్వాదన స్నేహ ఆత్మీయాభినందన మీ స్పందన
హన్య అభివాదాలు శ్రీపాద గారు!!