ఎంతవరకూ విచ్చిన్నం చెయ్యొచ్చో
పరిశీలించి చూస్తున్నట్లుంది.
పదాలు
భావాలను అసంబద్దంగా రాసి,
కూడికలు
తీసివేతల గణాంకాలు వేసి,
సెకన్లు
నిముషాలు,
గడియలను ఒలిచి,
గతించిన
అనర్ధపు ఆలోచనల
అవిరామ హస్తాలు
ప్రతిదీ కదిలిస్తుంటే ....
గుండె వేగంగా కొట్టుకుంటున్నా
మంచు దట్టంగా కురుస్తున్నా
సంబందం లేనట్లు
టివీ లో
చూడని చానల్స్ ను
మారుస్తూ
ఎర్రబడ్డ కళ్ళతో .... నేను.
చూడని చానల్స్ ను
ReplyDeleteమారుస్తూ
ఎర్రబడ్డ కళ్ళతో .... నేను.
చూడని చానల్స్ ను
Deleteమారుస్తూ
ఎర్రబడ్డ కళ్ళతో .... నేను.
బ్లాగుకు హృదయపూర్వక స్వాగతం!
ధన్యాభివాదాలు వింజమూరి వెంకట అప్పారావు గారు! శుభోదయం!!