ఈ మధ్య
పెద్ద పెద్ద మాటలు
అతి వినయ పద అస్రముల విసురులు ....
ఎందుకో
సంక్షిప్త క్లుప్త
పదాలతో సరిపెట్టగలనని తెలిసీ
లోలోపల
నాలో అంతర్లీనంగా నన్ను వేదిస్తూ
ఈ సంక్లిష్ట రూప ప్రశ్నల శరాలు ....
ఎందుకో
రాయబోయే ప్రశ్నకు రాబోయే
సమాధానం ముందుగానే తెలిసీ
పెదవులు త్రుళ్ళుతూ
ఈ ప్రత్యక్ష పరోక్ష ప్రకోపనలు
అక్షర అరుపుల శబ్దవిన్యాసాలు చేస్తుంది ....
ఎందుకో
చిన్ని చిరునవ్వుతో మనోగతం
అవగతం చెయ్యగలనని తెలిసీ
ఎందుకో
ఈ అస్తిమితత లాంటి
అసహనపు
తొందరపాటు లక్షణాలు ఎన్నో నాలో
No comments:
Post a Comment