నిన్ను పిలుస్తున్నాను.
గాలిలోకి, శున్యంలోకి నీ నామాన్ని ఊదుతున్నాను.
కళ్ళలోకి
నా గుండె లోతుల్లోకి
నన్నులోకి తదేకంగా చూసుకుంటున్నాను.
నటరాజులా నర్తిస్తూ అక్కడ నీవున్నావేమో అని
నీవు నన్ను స్పర్శిస్తున్నట్లుంది.
చెమటగందం వాసనేదో ....
నీవు సమీపం లో ఉన్నట్లు .... నీ కురుల వాసనలవిగో!
చిత్రమైన అనుభూతిలోకి జారిపోతున్నాను.
నన్ను నిన్నులోకి లాగేసుకుంటూ
నిన్ను లోని
నా గుండెలోకి దూరి, రక్త కణాల్లో .... అలజడి వై, ఓ చెలీ
న్యాయమా నీకిది!
గాలిలోనూ శూన్యంలోనూ నిన్నే పిలుస్తున్నాను
ఎక్కడున్నావో అని.
మది వేదనని చక్కగా చెప్పారు చంద్రగారు.
ReplyDeleteమది వేదనని చక్కగా చెప్పారు చంద్రగారు.
Deleteచక్కని ప్రొత్సాహక స్పందన స్నేహాభినందన
ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!
ఎంతో మంచి భావాలని పదిలంగా పొందు పరిచిన తీరు ప్రశంసనీయం .
ReplyDeleteచాలా బావుంది హాట్స్ ఆఫ్ టు యు !
మంచి పదజాలం వాడుతారు మీరు .
అదే మీ ప్రత్యేకత
అభినందనలు మీకు.
*శ్రీపాద
ఎంతో మంచి భావాలని పదిలంగా పొందు పరిచిన తీరు ప్రశంసనీయం .
Deleteచాలా బావుంది హాట్స్ ఆఫ్ టు యు!
మంచి పదజాలం వాడుతారు మీరు. అదే మీ ప్రత్యేకత .... అభినందనలు మీకు.
*శ్రీపాద గారు చక్కని స్నేహ ప్రోత్సాహక అభినందన మీ స్పందన
ధన్యాభివాదాలు! శుభ ఉషోదయం!!
నీవు నన్ను స్పర్శిస్తున్నట్లుంది.
ReplyDeleteచెమటగందం వాసనేదో ....
నీవు సమీపం లో ఉన్నట్లు ....ఎంతో నచ్చింది
నీవు నన్ను స్పర్శిస్తున్నట్లుంది.
Deleteచెమటగందం వాసనేదో ....
నీవు సమీపం లో ఉన్నట్లు ....
ఎంతో నచ్చింది
బాగుంది స్నేహ ఆత్మీయ ప్రోత్సాహక స్పందన అభినందన
ధన్యమనోభివాదాలు పద్మార్పిత గారు! శుభారుణోదయం!!