Friday, April 4, 2014

కోల్పోయానన్నదే నిజం






 








హృదయం
ఆత్మ చుట్టూ
ప్రదక్షిణలు
చేస్తూ ఉంది.
తెలియని చీకటిలో
నిండుగా
కూరుకుపోయి
కోల్పోయిన భవిష్యత్తును
శోధించడం లోనే
నిమగ్నమై ....

నిరాశ .... కాంతి లా
జ్ఞాపకాలు
వివిధ రూపాల్లో
విస్తరించి
సవారీ చేస్తూ ....
ఎందరితో పాటు
ఎరిగిన
ఏ అదృశ్య హస్తమో
కోరికలు
బలహీనతలను
ఎరిగి ....
కవ్వించి ఊరిస్తూ

దగ్గరలోనే ఉండి,
పట్టించుకోకుండా
కనీసం
చిరునవ్వైనా పూయకుండా
పరిసరాల్లో
కదులుతూ .... విరహం
మనసును పిండేసిన
తియ్యని బాధ
ఆత్మ క్షోభ
ప్రాణం పోతూ,
నిశ్శబ్దం .... మధ్యలో
దోబూచులాడుతూ

ఒకరితో ఒకరు
కలిసి
పెంచుకుని పంచుకున్న
ప్రేమ,
కాలగతిచెంది
లోతు తెలియని
అంతులేని
సమశ్యల సాగరంలో
మునిగి ....
ఊపిరిని కోల్పోయి
తేలుతూ
సచేతనత్వం, నిర్మలత్వం
ఇంద్రధనస్సు రంగులు
కోల్పోయి




ఖచ్చితత్వం
కాని నిజం
ఒకటున్నట్లు
తెలుస్తూ
శోధించడం లోనే
హృదయం
అమూల్యమైన సమయం
వృధా చేసుకుంటూ
ఆత్మ, హృదయం
కోల్పోవడం మాత్రమే
నిజం అని తెలిసి
ఆరాటం పెరిగి
అనర్ధమని అనిపించి 

2 comments:

  1. ఖచ్చితత్వం
    కాని నిజం
    ఒకటున్నట్లు
    తెలుస్తూ
    శోధించడం లోనే
    హృదయం...............ఈ శోదనలోనే జీవితం తెల్లారిపోతుంది.
    హృదయాన్ని కదిలించే కవిత , ఈ విదానం మీకే వస్తుంది, మంచు ముక్కలల్తో కూడా గుండె కోయొచ్చు అన్నది మీ శైలి.

    ReplyDelete
    Replies
    1. ఖచ్చితత్వం కాని నిజం
      ఒకటున్నట్లు
      తెలుస్తూ
      శోధించడం లోనే హృదయం...............
      ఈ శోదనలోనే జీవితం తెల్లారిపోతుంది.

      హృదయాన్ని కదిలించే కవిత , ఈ విదానం మీకే వస్తుంది, మంచు ముక్కలల్తో కూడా గుండె కోయొచ్చు అన్నది మీ శైలి.

      ఎంతో గొప్ప కాంప్లిమెంట్ అక్షర ఖడ్గాలతో కావ్య శంఖారావాలు చేసే కలం నుంచి ఇంత గొప్ప కాంప్లిమెంట్ పొందడం ఎంతో అదృష్టం గా భావిస్తున్నాను. మీ అభినందనను ప్రోత్సాహక స్పందనగా భావిస్తాను.
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete