Saturday, April 5, 2014

నిజం చెప్పవా .... పిల్లా!




 











ఒక్కసారైనా
గుసగుసలు ఆడు .... చాలు
ఎద లో ఉన్నది నేనే అని
ఎదను, ఎప్పటికీ
బహుమానంగా ఇచ్చేసానని

నీడనై .... నీ పక్కన ఉంటే
మక్కువని
ప్రేమిస్తూ ఉంటానని
వీలున్నన్ని విధాలుగా
రహశ్యాలు చెప్పాలనుందని

కాలంతో పాటు కదిలిరాని
మారని, మార్చుకోలేని
మనసుమాటలు
నేను నీ నీవాడిని అనే
నిజం .... వినాలని ఉందని

నీ కోరిక, నీ ఆశ, నీ గమ్యం
నీ నీడ
నీడకు కారణం చత్రం
నేనేననుకున్నావని
నీ తోడును నేనని అనుకున్నావని

చెప్పక తప్పడం లేదు.
నీ సాన్నిహిత్యాన్ని మించిన ఆనందం
నీ ప్రేమను మించిన ప్రేమ
నేనెరుగనని ..... అందుకే
బ్రతికున్నన్నాళ్ళూ తోడును నీడనని




నా ఆనందం, నా మనోగతం
నా జీవన సాఫల్యం .... నన్ను నేను
సమర్పించుకున్నానని .... నీకూ తెలుసు
నా ప్రేమ తపోదనాన్ని
నా హృదయాన్నీ, నా ఆత్మను

నిన్ను, నాతో, నాలోనే
జాగ్రత్తగా పొదువుకుంటానని తెలుసా
గాలి కూడా చొరలేనంత గా
విడదీయలేనంత
సాన్నిహిత్యంగా నీవెంటే ఉంటానని.

జన్మజన్మల బంధం కావాలని కోరుకుంటాను
నా బాహువుల్లో
గువ్వలా .... నువ్విమిడిపోయిన భావనను
ప్రేమై నీవు
నన్నల్లుకుపోవాలనే ఆశ ఒక వరమవ్వాలని

ఆలోచించేకొద్దీ అవగతమౌతుంది.
నిజంగా
స్వచ్చందంగా, నిర్మలంగా
నన్ను నేను సమర్పించుకుని
పరిపూర్ణంగా నిన్ను ప్రేమిస్తున్నానని.

పిల్లా! తలనుంచి గోటి వరకూ
తలమునకలై కొట్టుకుంటూ ఉన్నాను
నాకు నీ సాంగత్యం కావాలని
మాయ లేని నీ ప్రేమ కావాలని
ఇరు హృదయాత్మల సంగమం కావాలని.

2 comments:

  1. మనసులోని భావం చాలా పరిపూర్ణంగా ఉంది చంద్రగారు,వ్యక్తపరచడానికి వెనుకాడడం కూడా చాలా సహజంగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. మనసులోని భావం చాలా పరిపూర్ణంగా ఉంది చంద్రగారు,
      వ్యక్తపరచడానికి వెనుకాడడం కూడా చాలా సహజంగా ఉంది.
      బాగుంది స్పందన స్నేహ ఆత్మీయ అభినందన
      నమస్సులు శ్రీదేవీ!

      Delete