మన్నించకు .... నన్ను
బంధించు!
మరణం సంకెళ్ళతో .... నా ఆత్మను,
పీల్చేసెయ్యి .... ఊపిరితిత్తుల లోని ప్రాణవాయువును
వేగం గా
ఎలాంటి ప్రతిఘటనకు అవకాశం లేకుండా
ఈ గుండె
రక్తనాళాలను కత్తిరించు
నా మనసు భావనల ఆటుపోటుల
విపరీత స్పందనలను
చంపెయ్యి .... ఆపేసి,
మంచునూ మండించే ఈ ప్రేమ జ్వాలలను.
ఏదైనా దుర్మార్గం
ఏదైనా చెడును చేసెయ్యి .... ఓ ప్రియా!
విన్నవించుకుంటున్నా నీకే
నన్ను పూర్తిగా
తీసేసుకోమ్మని నా హృదయం లోతుల నేలమళిగల్లోంచి
ఈ తపనలు
ఈ మోహ రాగ అభిరుచులను
కడిగి, తుడిచి .... ఆరవెయ్యి
కామం ఆలోచనలను బూడిదలా కాల్చి
పూర్తిగా నన్ను ఖాళీ చేసేసి
అగ్నిపునీతుడ్ని చెయ్యి .... ఓ ప్రియా!
ReplyDelete" ఈ గుండె
రక్తనాళాలను కత్తిరించు
నా మనసు భావనల ఆటుపోటుల
విపరీత స్పందనలను
చంపెయ్యి .... ఆపేసి,
మంచునూ మండించే ఈ ప్రేమ జ్వాలలను."
చాలా భారమైన పదజాలం,.
చదివాక గుండె బరువెక్కింది.
మీ అన్ని కవితల్లో ( నే చదివిన వాటిలో ) ఈ
కవితను మీరు చాలా బాగా అల్ల్లారు.
మీలో ఓ అపూర్వమైన సాహిత్య సంపత్తి దాగి ఉంది.
అభినందనీయులు మీరు చంద్ర గారు.
*శ్రీపాద
"ఈ గుండె రక్తనాళాలను కత్తిరించు! నా మనసు భావనల ఆటుపోటుల విపరీత స్పందనలను చంపెయ్యి .... ఆపేసి,
Deleteమంచునూ మండించే ఈ ప్రేమ జ్వాలలను."
చాలా భారమైన పదజాలం,. చదివాక గుండె బరువెక్కింది. మీ అన్ని కవితల్లో ( నే చదివిన వాటిలో ) ఈ కవితను మీరు చాలా బాగా అల్ల్లారు.
మీలో ఓ అపూర్వమైన సాహిత్య సంపత్తి దాగి ఉంది. అభినందనీయులు మీరు చంద్ర గారు.
*శ్రీపాద
చక్కని విశ్లేషణ స్నేహ ఆత్మీయాభినందన
ధన్యాభివాదాలు శ్రీపాద గారు! శుభోదయం!!