Sunday, April 6, 2014

ఆత్మబంధువు




ఆ పరామర్శ .... ఒక మౌని పలుకరింపు
ఆ నవ్వు .... గద్గదికంగా గుండెతో నవ్వినట్లు
అతి సున్నితమైన ఆలోచనలు అవి
ఎంతో నిర్మలము
స్వచ్చము, దివ్యమైన ముఖం ....
ఒక చిత్రమైన అనుభవం అతను.

ఏ పని కైనా ఉపక్రమించినప్పుడు,
అవసరం ఏర్పడి, అడగాలనిపించినప్పుడు
అంతగా బ్రతిమాలాడాలా అని .... సిగ్గుపడుతూ అతను
చెయ్యందించి, సహకరించుతూ
ఆ అవసరం ప్రాముఖ్యతను తగ్గిస్తున్నప్పుడు
హిమాలయం అంత ఎత్తు ఆదర్శం అతను.




ఒక్కోసారి
నామమాత్రపు అవసరమే అయినా
నేనున్నాను అంటూ నిలబడి
సామాన్యుడిలా, ఎంతో సామాన్యంగా
సమశ్య తనదే అన్నట్లు పోరాడుతున్నప్పుడు
ఒక నమ్మకమైన ఆత్మ బంధువు అతను

నిజం! నిజంగా ....
ఎంత గర్వం అనిపిస్తుందో
అతని లాంటి నిగర్వి ని తెలిసిఉండటము


4 comments:

  1. మంచికి నిలువెత్తు నిదర్శనం, ఆదర్శం. ఆత్మవిస్వాసం ఆతని సొత్తు,
    అభినందనలు సర్.

    ReplyDelete
    Replies
    1. మంచికి నిలువెత్తు నిదర్శనం, ఆదర్శం.
      ఆత్మవిస్వాసం ఆతని సొత్తు,
      అభినందనలు సర్.

      చక్కని అభినందన స్నేహ ప్రోత్సాహక స్పందన
      ధన్యవాదాలు మెరాజ్ గారు! శుభమధ్యాహ్నం!!

      Delete
  2. ఎంత గర్వం అనిపిస్తుందో
    అతని లాంటి నిగర్వి ని తెలిసిఉండటము
    ఇటువంటివారిని చూసి నేర్చుకోవలసినది ఎంతో ఉంది.బాగుంది చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. ఎంత గర్వం అనిపిస్తుందో
      అతని లాంటి నిగర్వి ని తెలిసిఉండటము
      ఇటువంటి వారిని చూసి నేర్చుకోవలసినది ఎంతో ఉంది.
      బాగుంది చంద్రగారు.
      బాగుంది ఏకీభావన స్నేహాభినందన స్పందన
      ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!

      Delete